News June 26, 2024
బంగ్లాదేశ్ చెత్త రికార్డు!

T20WC చరిత్రలో బంగ్లాదేశ్ ఓ చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఇప్పటివరకు అన్ని వరల్డ్ కప్‌లు ఆడి ఒక్కసారి కూడా సెమీఫైనల్‌కు చేరని జట్టుగా బంగ్లా మిగిలిపోయింది. ఇప్పటి వరకు తొమ్మిది T20WCలలో టాప్10లో ఉన్న ఇతర 9 జట్లు సెమీస్ చేరాయి. IND, ENG, AUS, సౌతాఫ్రికా, శ్రీలంక, పాకిస్థాన్, వెస్టిండీస్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ ఏదో ఒక WCలో సెమీస్ చేరాయి. కానీ బంగ్లాదేశ్ సెమీస్‌లో అడుగు పెట్టలేదు.
Similar News
News January 12, 2026
డింపుల్ హయాతి దాసరి మనవరాలని తెలుసా?

డింపుల్ హయాతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను డైరెక్టర్ దాసరి నారాయణరావు మనవరాలినని వెల్లడించారు. రవితేజతో కలిసి నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రమోషన్స్‌లో ఈ విషయం చెప్పారు. ‘దాసరి నారాయణరావు గారు మా తాతకు కజిన్. మా నానమ్మ ప్రభ కిక్ మూవీలో హీరో తల్లిగా చేశారు. నన్ను ఇలియానాకు చెల్లిగా చేయమన్నారు. అప్పుడు నేను ఫోర్త్ క్లాస్. అందుకే పేరెంట్స్ వద్దన్నారు. తర్వాత చాలా ఫీలయ్యారు’ అని తెలిపారు.
News January 12, 2026
జనవరి 12: చరిత్రలో ఈ రోజు

1863: తత్వవేత్త స్వామి వివేకానంద జననం
1895: యల్లాప్రగడ సుబ్బారావు జననం
1962: రిచీ రిచర్డ్‌సన్ జననం
1991: హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ జననం
1991: చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక జననం
2005: సినీ నటుడు అమ్రీష్ పురి మరణం
2015: సినీ నిర్మాత, దర్శకుడు వి.బి.రాజేంద్రప్రసాద్ మరణం
* జాతీయ యువజన దినోత్సవం
News January 12, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 12, సోమవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.32 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.24 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.24 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.00 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.16 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


