News June 26, 2024

డాక్టర్ కాదు కామాంధుడు

image

శ్రీసత్యసాయి జిల్లాలో కామాంధ వైద్యుడి అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. చెన్నేకొత్తపల్లి మండల పరిధిలోని వైద్యుడు ఉదయ్‌ రోజూ రాత్రి 9 తర్వాత ఆసుపత్రి, సచివాలయాల్లో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలకు సెల్‌ఫోన్లలో అసభ్యకర సందేశాలు పంపుతున్నాడు. ‘మీరు కాకపోతే మీ పిల్లలను పంపించండి’ అంటూ ఒత్తిడి చేస్తుండటతో ఐదుగురు ఏఎన్‌ఎంలు మంగళవారం జిల్లా వైద్యాధికారిణి మంజువాణికి ఫిర్యాదు చేశారు. ఆమె దీనిపై విచారణకు ఆదేశించారు.

Similar News

News November 10, 2025

జాతీయస్థాయి పోటీలకు గుంతకల్లు విద్యార్థిని ఎంపిక

image

శ్రీకాకుళంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్-19 మహిళా క్రికెట్ పోటీల్లో అనంతపురం జట్టు విజేతగా నిలిచింది. దీంతో జాతీయస్థాయి పోటీలకు జిల్లా నుంచి ఐదుగురు మహిళా క్రీడాకారులు ఎంపికయ్యారు. గుంతకల్లు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థిని, వికెట్ కీపర్ బట్నపాడు అమూల్య జాతీయస్థాయి జట్టుకు ఎంపికైంది. ప్రిన్సిపల్ సాలాబాయి, కాలేజీ సిబ్బంది, పలువురు క్రీడాకారులు ఆమెను అభినందించారు.

News November 9, 2025

అనంతలో ముగిసిన రెవిన్యూ క్రీడలు

image

అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో రెండు రోజులుగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు ఆదివారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, సవిత, అనంతపురం MP అంబికా లక్ష్మీ నారాయణ, పలువురు MLAలు హాజరయ్యారు. అసోసియేషన్ నాయకులను అభినందించి, గెలుపొందిన వారికి మెమెంటోలు అందించారు.

News November 8, 2025

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు తాడిపత్రి యువకులు

image

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు తాడిపత్రి క్రీడాకారులు ఎంపికయ్యారు. గుంతకల్లు మండలం కొనకొందల జరిగిన బాలబాలికల 35వ సబ్ జూనియర్ క్రీడా పోటీలలో తాడిపత్రి కబడ్డీ క్రీడాకారులు ఉభయ్ చంద్ర, హర్షవర్ధన్, మనోజ్ కుమార్ ప్రతిభ కనబరిచి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. కడప జిల్లా పులివెందులలో జరగనున్న రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో వీరు పాల్గొంటారని కోచ్ శివ పేర్కొన్నారు.