News June 26, 2024
అక్కాయపల్లెలో బంగారు ఆభరణాల దోపిడీ
కడప నగరం తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్కాయపల్లెలోని శాస్త్రి నగర్లో నివాసం ఉంటున్న రాజశేఖర్ తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం అత్తగారింటికి వెళ్లాడు. మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చి చూసేటప్పటికి ఇంటి గేటు తీసి తాళం పగలగొట్టి ఉంది. ఇంటిలోకి వెళ్లి చూసి బీరువాలోని దాదాపు 12 తులాల బంగారు ఆభరణాలు దోపిడీకి గురైనట్లు గుర్తించాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Similar News
News January 16, 2025
కడప: ఇక పట్నం పోదాం..!
ఉమ్మడి కడప జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ముగిశాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లిన జిల్లా వాసులు పండగ కోసం తరలి వచ్చారు. మూడు రోజులు ఎంతో ఎంజాయ్ చేశారు. నిన్న రాత్రి నుంచే పలువురు తిరిగి తమ ఉద్యోగాలకు బయల్దేరారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది. రాయచోటి నేతాజీ సర్కిల్ వద్ద అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో బస్సుల కోసం ఇలా ప్రయాణికులు వేచి చూశారు.
News January 16, 2025
తిరుమలలో కడప బాలుడి మృతి
తిరుమలలో కడప బాలుడు చనిపోయాడు. చిన్నచౌక్ ఏరియాకు చెందిన శ్రీనివాసులు, కృష్ణవేణి దంపతులు 13వ తేదీన తిరుపతికి వెళ్లారు. వాళ్లకు 16వ తేదీ వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు కేటాయించారు. ఈక్రమంలో తిరుమల బస్టాండ్ సమీపంలో లాకర్ తీసుకున్నారు. నిన్న సాయంత్రం వారి రెండో కుమారుడు సాత్విక్ శ్రీనివాస్ రాజు(3) ఆడుకుంటూ రెండో అంతస్తు నుంచి పడిపోయాడు. కొండపై ఉన్న అశ్విని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.
News January 15, 2025
యర్రగుంట్లలో సంక్రాంతి రోజు అపశ్రుతి
యర్రగుంట్లలోని 5వ వార్డులో జయంత్ అనే ఐదేళ్ల బాలుడు విద్యుత్ తీగలు తగిలి మంగళవారం గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా ఉండే నాగిరెడ్డి ఇంటిపై 33KV విద్యుత్ తీగలు కిందికున్నాయి. ఆ మిద్దెపైన ఆడుకుంటున్న జయంత్ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురయ్యాడు. గమనించిన స్థానికులు బాబును ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. ఇదే క్రమంలో నాగిరెడ్డి ఇంట్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి నష్టం వాటిల్లింది.