News June 26, 2024

విపరీతంగా పెరిగిపోతున్న కూరగాయల ధరలు

image

నగరంలో కాయగూరలు ధరలు మండిపోతున్నాయి. రైతు బజార్‌లో రెండు మూడు రకాలు మినహా దాదాపు అన్నీ కిలో రూ.40 కి చేరాయి. బహిరంగ మార్కెట్‌లో అయితే అదనంగా మరొక రూ.20 బాదుతున్నారు. దొండ రూ.28 రూపాయలు, క్యాబేజీ రూ.30, బీట్రూట్ రూ.32, క్యారెట్ రూ.38, బెండ రూ.34, వంకాయలు తెల్లవి రూ.44, నల్లవి రూ.54, టమాటా రూ.64, బరబాటి రూ.54, బీన్స్ రూ.120, అల్లం రూ.160 బంగాళదుంపలు రూ.32 ఉల్లిపాయలు రూ.36 గా ధర పలుకుతున్నాయి.

Similar News

News November 5, 2025

విశాఖ డీసీపీ-1గా మణికంఠ చందోల్ బాధ్యతల స్వీకరణ

image

విశాఖ పోలీస్ కమిషనర్ రేట్ పరిధిలో డీసీపీ-1గా మణికంఠ చందోల్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసి బదిలీ కాగా తిరిగి ఆయనకే డీసీపీగా పోస్టింగ్ ప్రభుత్వం ఇచ్చింది. ఆయనకు పలు కార్యక్రమాల్లో బందోబస్తు ఏర్పాటు చేయడంలోనూ సఫలీకృతమైన అనుభవం, పరిపాలన పరంగా మంచి నైపుణ్యం ఉంది.

News November 5, 2025

జనాభా గణనకు సిద్ధం కావాలి: డైరెక్టర్ జె.నివాస్

image

భారతదేశ జనాభా గణన – 2027లో నమోదయ్యేందుకు ప్రజలు సిద్ధం కావాలని రాష్ట్ర జన గణన డైరెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. బుధవారం ఆయన భీమిలి మండలం ప్రజా పరిషత్, జీవీఎంసీ జోనల్ కార్యాలయంలోనూ ఇండ్ల గణన పై PRE -TEST (ముందస్తు పరీక్ష) కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర జన గణన డైరెక్టర్ అధ్యక్షతన జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి ఎన్యూమ్ రేటర్లకు, సూపర్‌వైజర్లకు‌ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.

News November 5, 2025

ఆరిలోవలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

సింహాచలం బీఆర్‌టీఎస్ రోడ్డులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సింహాచలం నుంచి బైక్ పై ఆరిలోవ వైపు వస్తున్న ఇద్దరు యువకులు రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బైకు పై ఉన్న ఇద్దరు యువకులు గాయపడడంతో ఆసుపత్రికి తరలించినట్లు ఆరిలోవ పోలీసులు తెలిపారు. మృతుడు గురుద్వార్‌కి చెందిన సూర్యనారాయణగా గుర్తించారు.