News June 26, 2024

HYDలో పెరిగిన బస్‌‌పాస్ కౌంటర్లు.. ఆదివారం సెలవు!

image

నగరంలో‌ నూతనంగా 2 బస్‌పాస్‌ కౌంటర్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గ్రేటర్ హైదరాబాద్‌ ఆర్టీసీ ED వెంకటేశ్వర్లు తెలిపారు. JNTU, లక్డీకాపూల్ బస్‌స్టాప్‌లో ఈ కౌంటర్లు ఉన్నాయి. 6:30AM నుంచి 8:15PM వరకు పనిచేస్తాయి. కొత్తగా గ్రీన్ మెట్రో లగ్జరీ మంత్లీ బస్‌పాస్ ఇస్తున్నారు. రేతిఫైల్, CBS, కాచిగూడ తదితర చోట్ల ఇప్పటికే కౌంటర్లు సేవలు అందిస్తున్నాయి. ఆదివారం సెలవు ఉంటుంది.
SHARE IT

Similar News

News July 1, 2024

సైబరాబాద్ పరిధిలో విస్తరించనున్న కూడళ్లు ఇవే..!

image

ట్రాఫిక్ సమస్య నేపథ్యంలో చౌరస్తాలను GHMC విస్తరించనున్న విషయం తెలిసిందే. కాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆరాంఘర్ చౌరస్తా, పీడీపీ కూడలి, దుర్గానగర్ కూడలి, పిల్లర్ నంబర్ 294 కూడలి, పిల్లర్ నంబర్ 202, బన్సీలాల్‌నగర్, ట్రిపుల్ ఐటీ కూడలి, శేరిలింగంపల్లి గుల్మొహర్ కూడలి, కొండాపూర్ ఆర్టీఏ ఆఫీసు, ఖాజాగూడ, రాడిసన్ డీఎల్ఎఫ్, ఆల్విన్ కాలనీ, మియాపూర్, ఖానామెట్, గూడెన్మెట్ చౌరస్తా తదితర కూడళ్లు ఉన్నాయి.

News July 1, 2024

హైదరాబాద్ పరిధిలో విస్తరించనున్న కూడళ్లు ఇవే..!

image

ట్రాఫిక్ సమస్య నేపథ్యంలో చౌరస్తాలను GHMC విస్తరించనున్న విషయం తెలిసిందే. కాగా HYD కమిషనరేట్ పరిధిలో హబ్సిగూడ, నల్గొండ ఎక్స్‌రోడ్డు, మిథాని, మదీనా, చాదర్‌ఘాట్ రోటరీ, నానల్‌నగర్, మెహిదీపట్నం, మల్లేపల్లి నోబుల్ టాకీస్, రేతిబౌలి, టప్పాచబుత్రా, పురానాపూల్, చాదర్‌ఘాట్ ఎక్స్ రోడ్డు, పంజాగుట్ట, జూబ్లిహిల్స్ రోడ్డు నంబర్ 36, బంజారాహిల్స్ రోడ్డు నంబర్లు 1,2, మహారాజ అగ్రసేన్ చౌరస్తా తదితర కూడళ్లు ఉన్నాయి.

News July 1, 2024

HYD: చౌరస్తాల్లో FULL ట్రాఫిక్.. GHMC కీలక నిర్ణయం

image

HYD, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని పలు చౌరస్తాల్లో నిత్యం ఫుల్ ట్రాఫిక్ ఉంటోంది. దీంతో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు యుద్ధ ప్రాతిపదికన కూడళ్లను విస్తరించాలని GHMC నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే 3 కమిషనరేట్ల పోలీసులు GHMCకి చౌరస్తాల జాబితాను అందించారు. రాచకొండలో 44, HYDలో 48, సైబరాబాద్‌లో 35 చౌరస్తాలు ఉన్నాయి. మొత్తం 127 కూడళ్లను విస్తరించనున్నారు.