News June 26, 2024

NLG: అరకొరగానే చిరుధాన్యాల సాగు

image

ఉమ్మడి జిల్లాలో రాను రాను చిరుధాన్యాల సాగు తగ్గిపోతున్నది. కందులు మినహా ఇతర పంటల సాగుపై రైతులు ఆసక్తి చూపడం లేదు. సాగు లాభదాయకంగా ఉన్నా సరైన గిట్టుబాటు ధరలు లభించకపోవడం, మార్కెట్లలోనూ మద్దతు లేకపోవడం తదితర కారణాల వల్ల రైతులు వీటివైపు మొగ్గు చూపడం లేదని తెలుస్తుంది. ప్రస్తుత రబీ సీజన్లో ఉమ్మడి జిల్లాలో కందులు 3940, ఇతర పప్పు దినుసులు 1578 ఎకరాల్లో మాత్రమే సాగు చేనున్నట్లు అధికారులు తెలిపారు.

Similar News

News July 1, 2024

NLG: ఇక క్యూఆర్ కోడ్ తోనే చెల్లింపులు!

image

మీ-సేవా కేంద్రాల్లో రెవెన్యూ పరమైన సేవలన్నింటికీ నగదు రహిత చెల్లింపులను తప్పని సరి చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 1 నుంచి ఈ నూతన విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ఇప్పటికే ప్రభుత్వం నిర్వహిస్తున్న కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇది సత్ఫలితాలిస్తుండటంతో ఇక మీదట ప్రైవేటు కేంద్రాల్లోనూ క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా రుసుం వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

News July 1, 2024

NLG: జిల్లాలో పెరుగుతున్న డెంగీ కేసులు

image

నల్గొండ జిల్లాలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. వర్షాకాలం షురూ కాకముందే  డెంగీ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 38 పాజిటివ్ కేసులు నమోదు కావడం డెంగీ వ్యాప్తి ఉధృతికి అద్దం పడుతోంది. నల్గొండ నియోజకవర్గంలోనే ఈ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. జులై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వర్షాలు కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

News July 1, 2024

ముమ్మరంగా వానాకాలం పంటల నమోదు ప్రక్రియ

image

ఉమ్మడి జిల్లాలో వానాకాలం పంటల నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు, సిబ్బంది నేరుగా పంట పొలాలకు వద్దకు వెళ్లి సాగు వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. కొన్నిచోట్ల సర్వర్ సమస్యలు తలెత్తినా నమోదు చేయాలని సర్కార్ ఆదేశించింది. ఆగస్టు నెలాఖరు వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని గడవు విధించింది. ఈ మేరకు ప్రస్తుతం పత్తి, కంది, జీలుగ, వరి తదితర పంటల లెక్క తేల్చుతున్నారు.