News June 26, 2024

వార్నర్ ట్రూ ఎంటర్‌టైనర్: యువరాజ్ సింగ్

image

డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్‌పై క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందించారు. ‘నిశ్శబ్దంగా వీడ్కోలు పలికేందుకు ఎవరూ ఇష్టపడరు. మీ కెరీర్ అత్యద్భుతం. గ్రౌండ్‌లో బౌండరీలు బాదడం నుంచి బాలీవుడ్ మూవ్స్, డైలాగ్స్ అన్నీ ప్రత్యేకమే. ఫీల్డ్‌లో, వెలుపల మీరు ట్రూ ఎంటర్‌టైనర్. మిత్రమా మీతో డ్రెస్సింగ్ రూమ్‌ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సమయాన్ని మీ లవ్లీ ఫ్యామిలీతో గడపండి’ అని ట్వీట్ చేశారు.

Similar News

News July 1, 2024

మరో 24 గంటలు బార్బడోస్‌లోనే భారత జట్టు!

image

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన బార్బడోస్‌ను మరో 6 గంటల్లో బెరిల్ హరికేన్(తుఫాన్) తాకనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ తరహా వాతావరణం నెలకొందని జాతీయ మీడియా ప్రతినిధులు తెలిపారు. వర్షం మొదలైందని, ఎయిర్ పోర్టు మూసివేయడంతో భారత జట్టు ఆటగాళ్లు హోటల్స్‌కే పరిమితమయ్యారని పేర్కొన్నారు. దీంతో మరో 24 గంటల వరకు అక్కడే ఉంటారని తెలుస్తోంది.

News July 1, 2024

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

image

TG: విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. 0-10 మంది విద్యార్థులున్న స్కూళ్లకు ఒకరు, 11 నుంచి 40 వరకు విద్యార్థులున్న స్కూళ్లకు ఇద్దరు, 41 నుంచి 60 మంది విద్యార్థులున్న స్కూళ్లకు ముగ్గురు, 61కి పైగా విద్యార్థులున్న స్కూళ్లకు గతంలో మాదిరిగానే టీచర్లను కేటాయించనుంది. స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగితే అందుకనుగుణంగా కేటాయింపు చేపట్టనుంది.

News July 1, 2024

BREAKING: హైకోర్టులో కేసీఆర్‌కు చుక్కెదురు

image

TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. విద్యుత్ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నరసింహారెడ్డి కమిషన్‌‌ను రద్దు చేయాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నిబంధనల మేరకే కమిషన్ వ్యవహరిస్తోందని, కేసీఆర్ పిటిషన్‌కు విచారణార్హత లేదన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.