News June 26, 2024
‘జగన్మోహనపురం’ బోర్డు తొలగింపు!

AP: తమ ఊరి పేరు పోలవరం అయితే జగన్మోహనపురం అని పెట్టారంటూ కొందరు యువకులు ఆర్చిపై ఆ పేరును తొలగించారు. కాకినాడ(రూ) మండలం పోలవరంలో ఈ ఘటన జరిగింది. 2020లో కొమరగిరి లేఅవుట్‌లో ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమానికి అప్పటి CM జగన్ వచ్చారు. దీంతో మార్గమధ్యలోని పోలవరం వద్ద ఆర్చి కట్టి జగన్మోహనపురం అని రాశారు. దీన్ని YCP నేతలు తీయలేదని.. GOVT మారడంతో తొలగిస్తున్నామని యువకులు తెలిపారు. అక్కడ జనసేన జెండా ఎగురవేశారు.
Similar News
News September 16, 2025
బందీలను వదిలేయండి.. హమాస్‌కు ట్రంప్ వార్నింగ్

హమాస్ నాయకులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ‘ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొనేందుకు బందీలను మానవ కవచాలుగా వాడేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. హమాస్ నేతలు ఏం చేస్తున్నారో వారికి అర్థమవుతోందా? ఇది మహా దారుణం. అతి తక్కువ మంది అలాంటివి చూసుంటారు. అలా జరగకుండా ఆపండి. లేదంటే అన్నీ ఒప్పందాలు రద్దవుతాయి. బందీలను వెంటనే విడుదల చేయండి’ అని వార్నింగ్ ఇచ్చారు.
News September 16, 2025
మద్యంమత్తులో లారీ డ్రైవర్ బీభత్సం

MPలోని ఇండోర్‌లో ఓ లారీ డ్రైవర్ మద్యం తాగి వాహనంతో బీభత్సం సృష్టించాడు. వాహనాలనే కాకుండా రోడ్డు పక్కనే నడుస్తున్న ప్రజలను కూడా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా పలువురికి గాయాలయ్యాయి. బైకులను ఢీకొట్టి వాటిని రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లాడు. ఓ బైకును లాక్కెళ్లడంతో దాని ట్యాంక్ పేలి లారీ మొత్తం తగలబడిపోయింది. డ్రైవర్ ఫుల్‌గా తాగేసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదైంది.
News September 16, 2025
ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గడువు మరో రోజు పొడిగింపు

AY 2025-26కు గానూ ITR ఫైలింగ్ గడువును ఆదాయ పన్ను శాఖ మరోసారి పెంచింది. జులై 31నే ఈ గడువు ముగియాల్సింది. దానిని SEP 15కు పొడిగించింది. ఇప్పుడు మరొక్క రోజు(సెప్టెంబర్ 16 వరకు) పెంచింది. ట్యాక్స్ ఫైలింగ్ పోర్టల్‌లో టెక్నికల్ గ్లిట్చ్ కారణంగా ఫైలింగ్‌కు చాలామంది ఇబ్బందులు పడినట్లు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే గడువును పొడిగించినట్లు తెలస్తోంది. గడువులోగా ఫైలింగ్ పూర్తి చేయాలని అధికారులు సూచించారు.