News June 26, 2024

BREAKING: జీవన్‌రెడ్డి‌కి సోనియా గాంధీ ఫోన్

image

TG: కాంగ్రెస్ MLC జీవన్‌రెడ్డి ఢిల్లీకి రావాలని సోనియా గాంధీ ఫోన్ చేశారు. BRS MLA సంజయ్‌ను పార్టీలో చేర్చుకోవడంతో అలకబూనిన జీవన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా నిన్న మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు జీవన్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను బుజ్జగించారు. ఈరోజు భట్టి ఢిల్లీకి వెళ్లిన కాసేపటికే అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది.

Similar News

News January 11, 2026

లేట్ కాకముందే డీల్ చేసుకోండి.. క్యూబాకు ట్రంప్ హెచ్చరిక

image

క్యూబాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. తమతో వీలైనంత త్వరగా ఒప్పందం కుదుర్చుకోవాలని స్పష్టం చేశారు. ‘ఇకపై క్యూబాకు ఆయిల్ లేదా డబ్బు వెళ్లదు. ఆలస్యం కాకముందే డీల్ చేసుకోవాలని సూచిస్తున్నా. వెనిజులా నుంచి వస్తున్న ఆయిల్, డబ్బుతో చాలా ఏళ్లు క్యూబా బతికింది. అందుకు బదులుగా వెనిజులాకు సెక్యూరిటీ సర్వీసెస్ అందించింది. ఇకపై అలా జరగబోదు’ అని ట్రూత్ సోషల్‌లో రాసుకొచ్చారు.

News January 11, 2026

కోహ్లీ సెంచరీ మిస్

image

స్టార్ క్రికెటర్ కోహ్లీ త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నారు. న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో 91 బంతుల్లో 93 పరుగులు చేసి ఔటయ్యారు. జెమీసన్ బౌలింగ్‌లో బ్రేస్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. దీంతో కింగ్ నుంచి మరో సెంచరీ చూడాలనుకున్న ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. విరాట్ ఔటయ్యే సమయానికి భారత్ స్కోర్ 234/3. టీమ్ ఇండియా విజయానికి 64 బంతుల్లో 67 రన్స్ అవసరం.

News January 11, 2026

గుమ్మానికి ఎదురుగా మరో గుమ్మం ఉండవచ్చా?

image

ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా మరో గుమ్మం ఉండటం శుభప్రదమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇలా ఉంటే గదులు, హాల్స్‌ను క్రమబద్ధంగా వినియోగించుకోవడానికి వీలవుతుందని చెబుతున్నారు. ‘దీనివల్ల ఇంటి లోపల శక్తి ప్రసరణ సాఫీగా జరిగి, కుటుంబీకుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఇల్లు చూసేందుకు అందంగా, అమరికగా కనిపిస్తుంది. ఈ నియమాన్ని పాటిస్తే గృహంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>