News June 26, 2024
ఖమ్మం: స్వల్పంగా పెరిగిన పత్తి ధర.. స్థిరంగా మిర్చి

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం
పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 20,000 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ. 7,200 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు పత్తి ధర రూ.100 పెరగగా, ఏసీ మిర్చి ధర మాత్రం స్థిరంగా ఉన్నట్లు మార్కెట్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
Similar News
News January 3, 2026
ఖమ్మం బస్టాండ్‌లో బాదుడు.. నిబంధనలకు పాతర!

ఖమ్మం నూతన బస్ స్టేషన్‌లో తినుబండారాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్లాట్‌ఫారమ్‌లపై ఉన్న స్టాళ్లలో ఎంఆర్‌పీ నిబంధనలను గాలికి వదిలేసి, స్నాక్స్, వాటర్ బాటిళ్లను ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. అధిక ధరలపై ప్రయాణికులు ప్రశ్నిస్తే నిర్వాహకులు దురుసుగా సమాధానం చెబుతున్నారని వాపోతున్నారు. ఆర్టీసీ అధికారులు తక్షణమే స్పందించి, తనిఖీలు నిర్వహించి అధిక ధరలకు కళ్లెం వేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
News January 3, 2026
ఖమ్మం ఆయుర్వేద ఆసుపత్రిలో మందులు నిల్!

ఖమ్మం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల మందుల కొరతతో వెలవెలబోతోంది. మూడు నెలలుగా ఇక్కడ మందులు అందుబాటులో లేకపోవడంతో చికిత్స కోసం వచ్చే రోగులు రిక్తహస్తాలతో వెనుదిరుగుతున్నారు. పెద్ద సంఖ్యలో బాధితులు ఈ ఆసుపత్రిని ఆశ్రయిస్తుంటారు. వైద్యులు పరీక్షించి చీటీలు రాసిస్తున్నా, మందుల కౌంటర్‌లో నిల్వలు లేవని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మందుల సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.
News January 3, 2026
ఖమ్మం: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కండి: అదనపు కలెక్టర్

రానున్న మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై అదనపు కలెక్టర్ శ్రీజ జిల్లాలోని అందరు మున్సిపల్ కమిషనర్లతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని, ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.


