News June 26, 2024

AUSపై భారత్‌ విజయం.. పాక్ మాజీ కెప్టెన్ సంచలన ఆరోపణలు

image

ఆస్ట్రేలియాతో సూపర్-8 మ్యాచ్‌లో భారత్ బాల్ ట్యాంపరింగ్ చేసి గెలిచిందని పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఆరోపణలు చేశారు. కొత్త బంతిని అర్ష్‌దీప్ 16వ ఓవర్‌లో ఎలా రివర్స్ స్వింగ్ చేయగలిగారని, అంటే బంతి 12 లేదా 13వ ఓవర్లోనే రివర్స్ స్వింగ్‌కు అనుకూలంగా మారిందా? అని ప్రశ్నించారు. అంపైర్లు కళ్లు తెరిచి ఉండాలని సూచించారు. ఈ మ్యాచ్‌లో భారత్ 205 రన్స్ చేయగా ఛేదనలో ఆస్ట్రేలియా 181 పరుగులకే పరిమితమై ఓడింది.

Similar News

News July 1, 2024

DOCTORS DAY: వైద్యో నారాయణో హరి!

image

వైద్యులు దేవుళ్లతో సమానమని చెబుతుంటారు. తల్లిదండ్రులు జన్మనిస్తే వారు పునర్జన్మనిస్తారు. ఎంతటి వ్యాధినైనా నయం చేస్తోన్న వైద్యుల దినోత్సవం నేడు. కరోనాను ఎదుర్కోవడంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కోట్లాది మందిని కాపాడారు. వారి సేవలను నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఇంటికే ప్రాథమిక వైద్య సదుపాయాన్ని అందిస్తోన్న వైద్యులకు సెల్యూట్ చేస్తూ ప్రశంసిస్తున్నారు.

News July 1, 2024

నేషనల్ డాక్టర్స్ డే.. ఈరోజే ఎందుకంటే?

image

పశ్చిమ బెంగాల్‌ రెండో సీఎం బిధాన్ చంద్ర రాయ్ ఒక ప్రముఖ వైద్యుడు. డాక్టర్‌గా, సీఎంగా వైద్య రంగంలో ఆయన చేసిన సేవలకు గౌరవ సూచకంగా బిధాన్ పుట్టిన రోజైన జులై 1ని భారత ప్రభుత్వం జాతీయ వైద్యుల దినోత్సవంగా 1991లో ప్రకటించింది. అప్పటి నుంచి మన దేశంలో ప్రతి ఏడాది జులై 1న నేషనల్ డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా వైద్యరంగంలో డాక్టర్ల నిస్వార్థ, అమూల్యమైన సేవలను గుర్తు చేసుకుంటుంటారు.

News July 1, 2024

మరో 24 గంటలు బార్బడోస్‌లోనే భారత జట్టు!

image

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన బార్బడోస్‌ను మరో 6 గంటల్లో బెరిల్ హరికేన్(తుఫాన్) తాకనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ తరహా వాతావరణం నెలకొందని జాతీయ మీడియా ప్రతినిధులు తెలిపారు. వర్షం మొదలైందని, ఎయిర్ పోర్టు మూసివేయడంతో భారత జట్టు ఆటగాళ్లు హోటల్స్‌కే పరిమితమయ్యారని పేర్కొన్నారు. దీంతో మరో 24 గంటల వరకు అక్కడే ఉంటారని తెలుస్తోంది.