News June 26, 2024

మహానందిలో చిరుత పాదముద్రలు గుర్తింపు

image

మహానంది పుణ్యక్షేత్రంలోని గోశాల వద్ద బుధవారం తెల్లవారుజామున చిరుత పులి సంచరించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని దేవస్థానం అధికారులు అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. డీఆర్ఓ హైమావతి, అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని చిరుత పులి సంచరించిన ప్రదేశాన్ని పరిశీలించారు. చిరుత పాదముద్రలను గుర్తించారు. మరోవైపు మహానంది గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆలయ సిబ్బంది సూచించారు.

Similar News

News January 18, 2026

కర్నూలు: చుక్కలు చూపిస్తున్న చికెన్ ధరలు

image

కర్నూలు జిల్లాలో చికెన్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కోడుమూరు, గోనెగండ్ల, పెద్దకడబూరు, పత్తికొండ, ఆలూరు, ఆస్పరి, ఎమ్మిగనూరు, ఆదోని, దేవనకొండ తదితర మండలాల్లో లైవ్ కిలో రూ.195, స్కిన్‌ రూ.300, స్కిన్‌లెస్ రూ.310-320 చొప్పున విక్రయిస్తున్నారు. మటన్ కిలో రూ.800-900, చేపలు రూ.180కి అమ్ముతున్నారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి.

News January 17, 2026

రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం: కలెక్టర్

image

రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా మండల స్థాయిలో కార్యాచరణాత్మక వ్యవసాయ ప్రణాళికలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఆదేశించారు. ఈ-క్రాప్ బుకింగ్‌ను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని, వరికి బదులుగా మల్లెపూలు, డ్రాగన్ ఫ్రూట్, బొప్పాయి, అరటి వంటి పంటలను ప్రోత్సహించాలని సూచించారు. పంట సేకరణ, మార్కెటింగ్‌లో రైతులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

News January 17, 2026

కర్నూలు: సంక్రాంతి నాడు విషాదాంతాలు

image

సంక్రాంతి పండుగ నాడు పలు కుటుంబాల్లో విషాదం మిగిలింది. పుల్లూరు టోల్ ప్లాజా వద్ద బైక్ ఢీకొని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మృతిచెందారు. పాణ్యం(M) తమ్మరాజుపల్లెలో వాహనం ఢీకొని రత్నమ్మ(50) మరణించింది. బేతంచెర్ల(M) శంకలాపురం గ్రామానికి చెందిన దస్తగిరి(33) బొలెరో ఢీకొని చనిపోయాడు. అప్పుల బాధతో గోనెగండ్లలో కౌలు రైతు జైనుద్దీన్, ఆదోనికి చెందిన వెంకటేశ్(42), కర్నూలుకు చెందిన శివకుమార్(33) ఉరేసుకున్నారు.