News June 26, 2024

T20ల్లో నం.1 బ్యాటర్‌గా హెడ్.. రెండులో సూర్య

image

ఆస్ట్రేలియా హిట్టింగ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ICC T20 ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానానికి ఎగబాకారు. ఆ స్థానంలోని భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ రెండో స్థానానికి పడిపోయారు. హెడ్‌కు 844 పాయింట్లు ఉండగా సూర్యకు 842 పాయింట్లున్నాయి. 3వ స్థానంలో ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్(816) ఉంటే 4, 5వ స్థానాల్లో బాబర్(755), రిజ్వాన్(746) ఉన్నారు. 6వ స్థానంలో బట్లర్(716), 7లో జైస్వాల్(672), 8లో మార్క్రమ్(659) ఉన్నారు.

Similar News

News December 30, 2025

రేపే వదిలేసెయ్..!

image

బద్ధకం, కోపం, సహనం లేకపోవడం, అతిగా ఆలోచించడం, నలుగురిలో ధైర్యంగా మాట్లాడలేకపోవడం.. ఇలా ఏదో ఒక సమస్య మీ ఎదుగుదలను అడ్డుకుంటోందా? అయితే దాన్ని అధిగమించేందుకు ఇదే మంచి తరుణం. రేపటితో ఈ ఏడాది ముగుస్తుంది. మీ బలహీనతను వదిలేసి ఎల్లుండి మొదలయ్యే నవ వసంతంలోకి కొత్తగా అడుగుపెట్టండి. మీరు ‘పర్‌ఫెక్ట్’ అనుకుంటే మార్పు చూడాలనుకుంటున్న వారికి దీన్ని షేర్ చేసేయండి.. Advance Happy New Year చెప్పేయండి.

News December 30, 2025

Fb: ప్రపంచ కుబేరుడు.. అప్పుతో ఇంటి రెంట్ పే

image

ప్రపంచ కుబేరుడు మస్క్ ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్తే 2008లో ఫ్రెండ్స్ అప్పు ఇస్తే రూమ్ రెంట్ పే చేశారు. అప్పట్లో స్పేస్‌ ఎక్స్‌లో భారీ పెట్టుబడి, ఇటు టెస్లా కార్ల సేల్స్ లేక అప్పులే మిగిలాయి. పైగా క్వాలిటీ లేదని భారీగా కార్లు రీకాల్ చేసే పరిస్థితి. మొదటి భార్య విడాకుల సమస్యా అప్పుడే. ఆ పర్సనల్, ప్రొఫెషనల్ టఫ్ టైమ్‌లో మానసికంగా వీక్ అయితే..? కానీ పరిస్థితిని ఎదుర్కొన్నారు కాబట్టే నేడు బిగ్‌గా నిలబడ్డారు.

News December 30, 2025

MOIL లిమిటెడ్ 67 పోస్టులకు నోటిఫికేషన్

image

<>MOIL<<>> లిమిటెడ్ 67 గ్రాడ్యుయేట్, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు నేటి నుంచి జనవరి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/BTech (మైనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, మెటలర్జీ), MSC( జియాలజీ), PG(సోషల్ వర్క్), MBA ఉత్తీర్ణులు అర్హులు. CBT, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.590. SC, ST, PwBDలకు ఫీజులేదు. https://www.moil.nic.in