News June 26, 2024

నకిలీ యప్‌ల ద్వారా రూ. 67 లక్షలు స్వాహా: బొబ్బిలి సీఐ

image

నకిలీ షేర్ మార్కెట్ యాప్‌ల ద్వారా రూ.67 లక్షలు నష్ట పోయారని బొబ్బిలి పట్టణ సీఐ నాగేశ్వరరావు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. మోసపూరిత ఫోన్ కాల్స్, మెసేజ్, లోన్ యాప్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అధిక మొత్తాలకు ఆశపడితే మోసపోవడం తప్ప.. చేయగలిగిందేమి లేదన్నారు.

Similar News

News July 3, 2024

VZM: బాలుడి ముక్కు కొరికేసిన కుక్కలు

image

బాడంగి మండలం గొల్లాదిలో వీధి కుక్కలు దాడిలో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డి.లోకేశ్ ఇంటి నుంచి మంగళవారం బయటకు వెళ్లగా కుక్కలు దాడి చేసి ముక్కు కొరికేశాయి. చెంప, చేతి భాగంలో కూడా గాయాలయ్యాయి. సాయంత్రం చింతాడ లక్ష్మిపై కూడా దాడి చేశాయి. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అధికారులు స్పందించి కుక్కలు బెడద నుంచి కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు.

News July 3, 2024

విజయనగరం: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

AU పరిధిలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ఈ నెల 4,6 తేదీలలో డా.వీఎస్ కృష్ణ కళాశాలలో స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. ఈ నెల 10 వరకు రిజిస్ట్రేషన్ చేసుకొని.. 11 తేదీ నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. 19న సీట్ల కేటాయించి..22 లోపు క్లాసులు ప్రారంభిస్తామని వర్సిటీ అధికారులు తెలిపారు. AU పరిధిలో మొత్తం 163 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.

News July 3, 2024

జిల్లాలో కాన్సర్ బాధితుల కోసం కలెక్టర్‌కు వినతి

image

జిల్లాలో కాన్సర్ బాధితులకు ఎటువంటి వైద్య సహాయం అందించట్లేదని కాన్సర్ ఆసుపత్రి సాధన కమిటీ అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అంబేడ్కర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. మన్యం జిల్లాకు కూడా కలిపి విజయనగరంలో కాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేసే ఏర్పాట్లు చేయాలని కోరారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కీమోథెరపీ లాంటి చికిత్సలు అందించేలా కృషి చేయాలన్నారు.