News June 26, 2024

ఈ ఏడాది ‘హెడ్’ రఫ్ఫాడించారు!

image

ICC T20 నంబర్ 1 బ్యాటర్‌ ఆస్ట్రేలియా హిట్టర్ ట్రావిస్ హెడ్ ఏడాది కాలంగా అద్భుతంగా రాణించారు. ఆసీస్ WC-2023 & WTC & Ashes ట్రోఫీలు గెలవడంలో కీలక పాత్ర పోషించారు. WTC ఫైనల్‌, WC సెమీస్‌, WC ఫైనల్లో POTMగా నిలిచారు. WCలో 54.8 యావరేజ్‌, 127 స్ట్రైక్ రేట్‌తో 329 రన్స్ చేశారు. IPLలో 191.5 స్ట్రైక్ రేట్‌తో 567 రన్స్‌తో ఆకట్టుకున్నారు. T20 WCలో 158.4 స్ట్రైక్ రేట్‌తో 255 పరుగులు చేశారు.

Similar News

News November 11, 2025

ఆరుద్రలో అడ్డెడు చల్లినా పుట్టెడు పంట

image

ఆరుద్ర కార్తె (జూన్ 22 నుంచి జూలై 5 వరకు ఉండే సమయం) అనేది వర్షాకాలం ప్రారంభంలో వ్యవసాయ పనులకు సరైన సమయం. ఈ కార్తెలో భూమిలో తగినంత తేమ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో అడ్డెడు( తక్కువ పరిమాణంలో) విత్తనాలు చల్లినా, అవి బాగా మొలకెత్తి పుట్టెడు(ఎక్కువ) పంటను ఇస్తాయని రైతుల విశ్వాసం. ఈ సామెత ఆరుద్ర కార్తెలో విత్తనాలు వేయడం, అప్పటి వర్షాలు.. పంటకు ఎంత అనుకూలంగా ఉంటాయో తెలియజేస్తుంది.

News November 11, 2025

హనుమాన్ చాలీసా ఎందుకు చదవాలి?

image

హనుమంతుని పూజతో భూతప్రేత పిశాచ భయాలు తొలగి, శని ప్రభావం వల్ల కలిగే బాధలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. హనుమాన్ చాలీసా పారాయణం వలన మంచి బుద్ధి, ధైర్యం, కీర్తి లభిస్తాయని నమ్మకం. ఆయనకు ఇష్టమైన అరటి, మామిడి పండ్లను నివేదించి, పూజించడం వల్ల చేపట్టిన కార్యాలు త్వరగా పూర్తై, మనసులోని కోరికలు నెరవేరుతాయట. ‘సంతానం కోసం ఎదురుచూసే దంపతులు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం’ ఉత్తమం అని పండితులు చెబుతున్నారు.

News November 11, 2025

శ్రద్ధ తీసుకోకనే అందెశ్రీ చనిపోయారు: వైద్యులు

image

TG: ప్రజా కవి అందెశ్రీ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోకపోవడం వల్లనే మరణించారని వైద్యులు తెలిపారు. నెల రోజులుగా బీపీ టాబ్లెట్స్ తీసుకోకపోవడం వల్లనే గుండెపోటు వచ్చిందని చెప్పారు. మూడు రోజుల నుంచి అనారోగ్యంగా ఉన్నా ఆసుపత్రికి వెళ్లలేదని తెలిపారు. కాగా ఆయన అంత్యక్రియలు ఇవాళ ఘట్కేసర్‌లోని ఎన్ఎఫ్‌సీ నగర్‌లో ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరై నివాళులర్పించనున్నారు.