News June 26, 2024

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: నిర్మల్ ఎస్పీ

image

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ ముందుకెళ్తుందని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. అంతర్జాతీయ మారకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో మత్తు పదార్థాల కట్టడికి పోలీసు శాఖ ఉక్కు పాదం మోపుతుందని అన్నారు. వీటి కట్టడికి ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు. మత్తు పదార్థాలకు సంబంధించి తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో 8712671111, డయల్ 100కు సమాచారం అందించాలన్నారు.

Similar News

News February 13, 2026

విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తప్పవు: ADB DSP

image

ఆదిలాబాద్ మున్సిపల్ ఫలితాల వేళ డీఎస్పీ జీవన్ రెడ్డి ఆంక్షలు విధించారు. అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం, టపాకాయలు పేల్చడం నిషేధమని హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రం, ప్రధాన చౌరస్తాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని.. ప్రజలు గుమిగూడరాదని స్పష్టం చేశారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని, పోలీసులకు సహకరించాలని కోరారు.

News February 13, 2026

ఆదిలాబాద్‌లో తొలి విజయం మహిళదే

image

ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో మొదటి ఫలితం వెలువడింది. 48 వార్డులో బీజేపీ అభ్యర్థి ఆకుల రేణుక ప్రవీణ్ విజయం సాధించారు. తమ సమీప ఏఐఎఫ్‌బీ పార్టీ అభ్యర్థి రంగినేని మనీషాపై 34 ఓట్లతో విజయం సాధించారు. కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠ భరితంగా సాగింది. మిగిలిన వార్డుల్లో ఫలితాలు వెలువడాల్సి ఉన్న నేపథ్యంలో ఎక్కడ చూసినా టెన్షన్ వాతావరణం నెలకొంది.

News February 13, 2026

ఆదిలాబాద్: ఈనెల 14న స్విమ్మింగ్ పోటీలు

image

ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఈనెల 14వన జిల్లా స్థాయి స్విమ్మింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు జక్కుల శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే స్విమ్మింగ్ పూల్ వద్ద ముమ్మరంగా ఏర్పాట్లు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. క్రీడాకారుల వయసు ఆధారంగా గ్రూప్-1 నుంచి గ్రూప్-4 వరకు విభాగాల వారీగా పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. పాల్గొనే వారు 9494945402 నంబర్‌కు సంప్రదించాలన్నారు.