News June 26, 2024

చిత్తూరు జిల్లాలో మళ్లీ సగం మంది ఫెయిల్

image

ఇంటర్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాల్లోనూ ఉమ్మడి జిల్లా విద్యార్థులు సత్తాచాటలేకపోయారు. తిరుపతి జిల్లాలో 8256 మంది పరీక్షలు రాయగా 3,719 మందే(45శాతం) పాసయ్యారు. రాష్ట్రంలోనే 6వ స్థానంలో నిలిచారు. చిత్తూరు జిల్లాలో 5,817 మందికి 2,597 మంది ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 7వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లాలో 5,371 మందికి 2,597 మంది పాసై 46 శాతం ఉత్తీర్ణతతో 5వ స్థానంలో నిలిచారు.

Similar News

News February 3, 2026

చిత్తూరు: బ్యాక్ లాగ్ సీట్ల భర్తీకి దరఖాస్తులు

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని MJP గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి, ఇంటర్మీడియట్, బ్యాక్ లాగ్ సీట్ల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సదుం, సత్యవేడు, తంబళ్లపల్లి, ఐతేపల్లి, కుప్పంలలో బాలురకు, కలికిరి, పీలేరు, ఉదయమాణిక్యం, పెద్దపంజాణి, పులిచెర్ల, కుప్పంలలో బాలికలకు గురుకుల పాఠశాలలు ఉన్నాయన్నారు. http://mjpa pbcwreir.apcfrr.in లో దరఖాస్తు చేయాలన్నారు.

News February 3, 2026

మామిడి రైతులను ఆదుకోవాలని వినతి

image

గత సీజన్‌లో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారని వారిని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని మామిడి రైతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మునీశ్వర్ రెడ్డి కోరారు. మామిడి రైతులకు 50% రాయితీతో ఎరువులు, పురుగు మందులు అందేలా చూడాలని కలెక్టర్ సుమిత్ కుమార్‌కు సోమవారం వినతిపత్రం అందించినట్లు ఆయన చెప్పారు. మామిడి కవర్లను సబ్సిడీ ధరతో అందించేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.

News February 2, 2026

చిత్తూరు జిల్లాలో విషాదం.. వేడి నీళ్లలో పడి చిన్నారి మృతి

image

వెదురుకుప్పం (M) పాతగుంట గ్రామానికి చెందిన జి మధు (3) సోమవారం వేడి నీటిలో పడి శరీరం పూర్తిగా కాలిపోయిన ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల అత్యవసర చికిత్స నిమిత్తం వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మృతి చెందింది. దీంతో కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.