News June 26, 2024

తొందర పడకండి ఎమ్మెల్యేలతో కేసీఆర్

image

ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో నేతలతో ఆయన వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న పలువురు ఎమ్మెల్యేలతో సమావేశం కాగా, ఇవాళ హరీశ్ రావు, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డిలతో భేటీ అయ్యారు. పార్టీ మారుతున్న నేతల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యేలకు సూచించారు.

Similar News

News February 27, 2026

మెదక్: నేడు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ రాక

image

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల సమీక్షా సమావేశానికి రాష్ట్ర కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య హాజరుకానున్నారు. ఈ మేరకు డీబీఎఫ్ (DBF) అధ్యక్షుడు దుబాసి సంజీవ్ తెలిపారు. ఈ సమావేశానికి జిల్లాలోని అంబేడ్కర్ యువజన సంఘాలు, దళిత ప్రజా సంఘాల నాయకులు, అట్రాసిటీ బాధితులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

News February 27, 2026

తూప్రాన్: విద్యుదాఘాతంతో యువరైతు మృతి

image

తూప్రాన్ మండలం మల్కాపూర్ వద్ద విద్యుదాఘాతంతో యువరైతు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మల్కాపూర్ గ్రామానికి చెందిన రైతు కొంతం మణికాంత్(23) గురువారం సాయంత్రం వ్యవసాయ పొలం వద్ద విద్యుత్తు సరఫరాను పరిశీలిస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దాంతో మణికాంత్ అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు

News February 26, 2026

మెదక్: ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 98.26% హాజరు

image

మెదక్ జిల్లాలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 28 కేంద్రాల్లో మొత్తం 98.26% మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాధికారి మాధవి తెలిపారు. జనరల్ విభాగంలో 4850 మంది, ఒకేషనల్ విభాగంలో 527 మంది పరీక్ష రాశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, గైర్హాజరైన 95 మంది విద్యార్థుల వివరాలను వెల్లడించారు.