News June 26, 2024
బుమ్రా బంతులకు ఏ జట్టు వద్దా సమాధానాలు లేవు: కాలింగ్‌వుడ్

ఈ T20WCలో టీమ్ ఇండియా ప్రత్యేకంగా కనిపిస్తోందని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ పాల్ కాలింగ్‌వుడ్ చెప్పారు. బుమ్రా సంధించే బంతులను ఎదుర్కొనేందుకు ఏ జట్టు వద్దా సమాధానాలు లేవన్నారు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అతను కచ్చితత్వం, పేస్, నైపుణ్యంతో బౌలింగ్ చేస్తున్నారని కొనియాడారు. కెప్టెన్ రోహిత్ కూడా ఫామ్‌లోకి వచ్చారని, రేపు ఇంగ్లండ్‌తో జరిగే సెమీఫైనల్‌లో IND ఓడిపోదని అనుకుంటున్నానని పేర్కొన్నారు.
Similar News
News September 19, 2025
మునగాకుతో జుట్టు సమస్యలకు చెక్

మునగాకులలో అమైనో ఆమ్లాలు, విటమిన్లు, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. మునగాకు పొడిని హెయిర్ ప్యాక్‌గా వాడుకోవచ్చు. టేబుల్ స్పూన్ మునగాకు పొడికి కొంచెం పెరుగు కలిపి పేస్టులా చేసుకోవాలి. దీన్ని కుదుళ్లకు పట్టేలా వేసుకొని అరగంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తలలో చుండ్రు, దురద తగ్గుతుంది. జుట్టు ఆరోగ్యవంతంగా, నిగనిగలాడుతుంది.
News September 19, 2025
TDPలో చేరనున్న ముగ్గురు YCP ఎమ్మెల్సీలు?

AP: వైసీపీ ఎమ్మెల్సీలు బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వైసీపీకి, ఎమ్మెల్సీ పదవులకు వీరు ముగ్గురు రాజీనామా చేశారు. కాగా వీరి రాజీనామాలపై మండలి ఛైర్మన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
News September 19, 2025
పవన్ హాన్స్ లిమిటెడ్‌లో 13 ఉద్యోగాలు

భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పవన్ హాన్స్ లిమిటెడ్‌లో 13 పోస్టులకు ప్రకటన వెలువడింది. అసిస్టెంట్ మేనేజర్, సేఫ్టీ మేనేజర్ తదితర ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తారు. పోస్టును బట్టి B.Tech/B.E, M.A, MCA, డిగ్రీ పూర్తయిన వారు, CHPL/ATPL లైసెన్సు ఉన్నవారు అర్హులు. దరఖాస్తుకు చివరి తేదీ OCT 12. పూర్తి వివరాల కోసం <