News June 26, 2024

విశాఖ టెక్ మ‌హీంద్రాలో ఉద్యోగ అవకాశాలు

image

విశాఖలో టెక్ మహీంద్రాలో 328 ఉద్యోగాల భర్తీ కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి డి.అరుణ తెలిపారు. ఈనెల 29న విశాఖ‌ప‌ట్నంలోని డా. విఎస్ కృష్ణా ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల‌లో జాబ్ మేళా జ‌రుగుతుంద‌న్నారు. ఆస‌క్తి ఉన్న అభ్యర్థులు తమ పేర్లను సంబంధిత వెబ్‌సైట్‌లో ఈనెల 28లోగా న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంది. డిగ్రీ పాస్/ఫెయిల్ అయిన వారు అర్హులు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉన్న వాళ్లకి ప్రాధాన్యత.

Similar News

News November 3, 2025

VZM: మొంథా బీభత్సం.. 665.69 హెక్టార్లలో పంటల నష్టం..!

image

మొంథా తుఫాను కారణంగా జిల్లాలో పలు మండలాల్లో పంటలకు గణనీయమైన నష్టం జరిగినట్లు జిల్లా వ్యవసాయ అధికారి వీటీ రామారావు తెలిపారు. జిల్లాలోని 27 మండలాల్లో పంట నష్టాల అంచనా పూర్తయిందని ఆయన తెలిపారు. మొత్తం 665.69 హెక్టార్లలో 3,076 మంది రైతులు పంట నష్టాన్ని ఎదుర్కొన్నారని, వరి 644.03 హెక్టార్లు, మొక్కజొన్న 6.40 హెక్టార్లు, పత్తి 4.93 హెక్టార్లు, మినుములు 1.01 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని వివరించారు.

News November 2, 2025

దేవాలయాల వద్ద ఏర్పాట్లుపై కలెక్టర్ సూచనలు

image

కార్తీక సోమవారం సందర్భంగా జిల్లాలోని వివిధ దేవాలయాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందని, దేవాలయాలపై కన్నేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. దేవాలయాల వద్ద భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్య చర్యలు పకడ్బందీగా ఉండేలా అధికారులు, దేవస్థాన నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులు క్రమశిక్షణగా, శాంతియుతంగా దర్శనాలు ముగించుకోవాలన్నారు.

News November 2, 2025

విజయనగరం టీంకు ఓవరాల్ ఛాంపియన్ షిప్

image

ఏలూరులో జరిగిన 69వ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలలో అండర్-17 విభాగంలో విజయనగరం బాలికలు జట్టు ఓవరాల్ ఛాంపియన్ షిప్ గెల్చుకుంది. ఉమ్మడి 13 జిల్లాల నుంచి సుమారు 600 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన వారు జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు వెళ్తారు. వీరందరినీ రాష్ట్ర స్కూల్ గేమ్స్ అబ్జర్వర్ వెంకటేశ్వరరావు అభినందించారు. జిల్లా పేరును జాతీయస్థాయిలో కూడా మార్మోగించాలన్నారు.