News June 26, 2024

ఉమ్మడి కర్నూలు జిల్లా టాప్ న్యూస్

image

> టెన్త్ అడ్వాన్స్‌డ్, ఇంటర్ ఫస్టియర్ సప్లి ఫలితాలు విడుదల
> సున్నిపెంటలో ఎమ్మెల్యేకి కూటమి నాయకుల ఘన స్వాగతం
> కొంత టైమ్ ఇస్తాం.. తర్వాత ఉద్యమాలు: కాటసాని
> నందికొట్కూరులో వర్షం
> మంత్రిగా బీసీ బాధ్యతలు
> అధైర్య పడొద్దు, అండగా ఉంటా: శిల్పా
> చిరుతని పట్టుకోవాలని పచ్చర్లవాసుల రాస్తారోకో
> ఆదోనిలో రౌడీయిజానికి చోటులేదు: ఎమ్మెల్యే
➽ ఉమ్మడి జిల్లా పూర్తి సమాచారంకై లొకేషన్‌పై క్లిక్ చేయండి

Similar News

News July 8, 2024

భక్తుల రద్దీకి అనుగుణంగా శ్రావణమాసం ఏర్పాట్లు

image

శ్రీశైలం ఆలయానికి శ్రావణమాసంలో వచ్చే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆలయ ఈవో పెద్దిరాజు ఆదేశించారు. శ్రావణమాసం ఏర్పాట్లలో భాగంగా సోమవారం ఆలయ సిబ్బందితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి వారికి శ్రావణమాసంలో ప్రత్యేక పూజలు ఉంటాయన్నారు. భక్తులకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు.

News July 8, 2024

శ్రీశైలంలో ఉద్యోగుల విధుల్లో మార్పులు

image

పరిపాలన సౌలభ్యంలో భాగంగా శ్రీశైలం దేవస్థానంలో వివిధ కీలక విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల స్థానాలను మారుస్తూ ఈవో పెద్దిరాజు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా ఆలయంలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న 50మంది రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అంతర్గత బదిలీలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈవో పెద్దిరాజు మాట్లాడుతూ.. ఎవరికి కేటాయించిన స్థానాల్లో వారు విధులు పకడ్బందీగా నిర్వహించాలన్నారు.

News July 8, 2024

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు తగిన ప్రాధాన్యతనిస్తూ ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. నంద్యాల జిల్లా కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను జిల్లా కలెక్టర్‌కు అర్జీల రూపంలో అందించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు.