News June 26, 2024
రషీద్ ఖాన్‌కు ఐసీసీ మందలింపు

బంగ్లాదేశ్‌తో మ్యాచులో అఫ్గానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ <<13505191>>బ్యాట్<<>> విసరడంపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రవర్తన ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించడమేనని మందలించింది. అఫ్గాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇన్నింగ్స్ 19వ ఓవర్లలో పరుగుకు నిరాకరించినందుకు తోటి ప్లేయర్ కరీమ్ జనత్ వైపుగా బ్యాట్ విసిరి అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
Similar News
News September 16, 2025
వివేకా హత్య కేసులో దర్యాప్తుకు సిద్ధం: సీబీఐ

AP: వైఎస్ వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. కోర్టు తగిన ఆదేశాలిస్తే ముందుకు వెళ్తామని పేర్కొంది. పిటిషనర్ ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాలని కోరుతున్నారని చెప్పింది. ఈ మేరకు సీబీఐ అభిప్రాయాన్ని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తెలిపారు.
News September 16, 2025
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

TG: రాబోయే 3 గంటల్లో కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, హనుమకొండ, భూపాలపల్లి, జగిత్యాల, జనగాం, కరీంనగర్, మేడ్చల్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, భువనగిరిలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News September 16, 2025
రూ.100 కోట్ల కలెక్షన్ల దిశగా ‘మిరాయ్’

తేజా సజ్జ నటించిన ‘మిరాయ్’ మూవీ రూ.100 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకెళ్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.91.45 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మూవీ యూనిట్ తెలిపింది. మొదటి 3 రోజుల్లో రూ.81.2 కోట్లు, నిన్న రూ.10.25 కోట్లు కలెక్ట్ చేయడం గమనార్హం. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు మనోజ్, శ్రియ కీలక పాత్రలు పోషించారు.