News June 27, 2024

KNR: వయోవృద్ధుల సమస్యలను సత్వరమే పరిష్కరించండి: కలెక్టర్

image

కొడుకులు ఇబ్బందులు పెట్టే వయోవృద్ధులు, తల్లిదండ్రులకు అధికారులు అండగా ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. బుధవారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ చట్టం కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ఆమె సమీక్షా నిర్వహించారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సూచించారు. కొడుకులను పిలిపించి తగిన కౌన్సెలింగ్ ఇచ్చి సమస్యలు పరిష్కరించాలన్నారు.

Similar News

News July 3, 2024

పెద్దపల్లి: బాలికపై వృద్ధుడు అత్యాచారం

image

ఎనిమిదేళ్ల బాలికపై వృద్ధుడు లైంగిక దాడికి యత్నించిన ఘటన కాల్వ శ్రీరాంపూర్ మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక స్థానికంగా ఉన్న సామాజిక మరుగుదొడ్డిలోకి వెళ్లిన సమయంలో దుర్గయ్య(65) అత్యాచారయత్నం చేశాడు. గమనించిన గ్రామస్థులు వృద్ధునికి దేహశుద్ధి చేసి బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ మేరకు భారతీయ న్యాయ సంహిత చట్టంలో భాగంగా పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News July 3, 2024

రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలి: C&MD

image

ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికి రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని సంస్థ C&MD బలరాం సూచించారు. HYD సింగరేణి భవన్ నుంచి అన్ని ఏరియాల డైరెక్టర్లు, GMలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వర్షా కాలం వల్ల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికుల భద్రతపై మరింత దృష్టి సారించాలన్నారు.

News July 2, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ మెట్‌పల్లి, కోరుట్లలో పర్యటించిన జగిత్యాల కలెక్టర్. @ గోదావరిఖనిలో నలుగురు పేకాటరాయుళ్ల పట్టివేత. @ వెల్గటూర్ మండలంలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య. @ పెద్దపల్లి మండలంలో ట్రాక్టర్, బైకు ఢీ మహిళ మృతి. @ తంగళ్ళపల్లి మండలంలో మద్యానికి బానిసై వ్యక్తి మృతి. @ సిరిసిల్ల, కరీంనగర్ లో పర్యటించిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు. @ కేసీఆర్ ను కలిసిన జగిత్యాల, సిరిసిల్ల జడ్పి ఛైర్పర్సన్లు.