News June 27, 2024

ఆర్మూర్ అభివృద్ధి కోసం పోరాటానికి సిద్ధం: ఎమ్మెల్యే

image

ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సొంత నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించగా, ఆర్మూర్ నియోజకవర్గంలోనూ పైలెట్ ప్రాజెక్టు కింద ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మించాలన్నారు. దీనిపై వారం రోజులలో ప్రభుత్వం నిర్ణయం తెలపాలన్నారు. లేకపోతే దీక్ష చేయడానికి అనుమతి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.

Similar News

News July 3, 2024

NZB: ‘పదెకరాల్లోపు ఉన్నవారికే రైతుభరోసా ఇవ్వండి’

image

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకం చేపట్టనున్న రైతుభరోసా పథకంపై రైతుల సూచనలు కోరుతోంది. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 89 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. ఇప్పటివరకు 60 సంఘాల్లో మీటింగ్స్ నిర్వహించారు. 29 సంఘాల్లో సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటి వరకు తీసుకున్న అభిప్రాయాల్లో 60 శాతం మంది 10ఎకరాల లోపు ఉన్నవారికే రైతుభరోసా ఇవ్వాలని చెబుతున్నారు. గుట్టలు, బీడు భూములకు ఇవ్వొదని కోరుతన్నారు.

News July 3, 2024

ఆ దుర్ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది: MP అరవింద్

image

ఉత్తరప్రదేశ్ హాథ్రస్ తొక్కిసలాట దుర్ఘటన పట్ల నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆ ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారి కుటుంబాలకు ఆ భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు రాసుకొచ్చారు.

News July 3, 2024

పోచారం శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్స్

image

‘ఎప్పుడైనా లోకల్ లోకలే. బయట నుండి వచ్చిన వాళ్లు అద్దెకు ఉండేవారు మాత్రమే’ అంటూ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాసుల బాలరాజు మంగళవారం పోచారంను తన అనుచరులతో కలువగా పోచారం మాట్లాడుతూ.. బాలరాజుకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి వస్తే వాళ్లకు కడుపు నొప్పి ఎందుకు ? అంటూ కాంగ్రెస్‌లోని ఒక వర్గాన్ని ఉద్దేశించి అన్నారు.