News June 27, 2024

మహానంది పరిసర ప్రజలు అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్

image

మహానంది అటవీ పరిసర ప్రాంతాలలో చిరుతపులి సంచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నంద్యాల జిల్లా కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని సెంటినరీ హాల్లో చిరుత పులి సంచారం – జాగ్రత్తలపై జాయింట్ కలెక్టర్ టి. రాహు కుమార్ రెడ్డితో కలిసి అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అనురాగ్ మీనా, నంద్యాల డీఎఫ్ఓ శివ శంకర్ రెడ్డిలతో సమీక్షించారు.

Similar News

News January 13, 2026

ఇంటిల్లిపాది సంక్రాంతిని సంతోషంగా జరుపుకోండి: డీఐజీ

image

తెలుగు సంస్కృతి సంప్రదాయ మేళవింపు సంక్రాంతి పండుగను ఇంటిల్లిపాది సంతోషంగా జరుపుకోవాలని డీఐజీ, జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల జోలికి వెళ్లకుండా భోగి, మకర, సంక్రాంతి, కనుమ పండుగలను ఆనందంగా జరుపుకోవాలన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బందికి ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

News January 13, 2026

కర్నూలు: 95 మంది లబ్ధిదారులకు టిడ్కో గృహాల అందజేత

image

పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి టీజీ భరత్ అన్నారు. మంగళవారం కర్నూలు నగర శివారులోని జగన్నాథ గట్టు వద్ద నిర్వహించిన టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమంలో ఆయన 95 మంది లబ్ధిదారులకు గృహ మంజూరు పత్రాలు, మెగా కీలు అందజేశారు. టిడ్కో గృహాలకు విద్యుత్, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. ఫిబ్రవరిలో మరో 500 గృహాలు అందజేస్తామన్నారు.

News January 13, 2026

ప్రాక్టికల్ పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించాలి: కలెక్టర్

image

జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను అన్ని సౌకర్యాలతో కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. పరీక్ష గదులు పరిశుభ్రంగా ఉండాలన్నారు. సెల్‌ఫోన్లకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. జనవరి 27 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు 21,150 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు.