News June 27, 2024
సఫారీలకు సెమీస్ గండం?

టీ20 వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికాను సెమీస్ గండం వెంటాడుతోంది. ఆ జట్టు ఇప్పటివరకు ఫైనల్‌కు చేరుకోలేదు. ఇప్పటివరకు రెండు సార్లు సెమీస్ చేరగా.. రెండు సార్లు ఓడిపోయింది. 2009లో పాకిస్థాన్‌పై, 2014లో ఇండియాపై ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. అఫ్గానిస్థాన్‌తో జరిగే సెమీస్‌లో గెలిచి ఫైనల్‌కు వెళ్లాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాగా ఈ రెండు జట్లలో ఏది గెలిచినా ఆ జట్టుకు ఇదే తొలి ఫైనల్ అవుతుంది.
Similar News
News April 13, 2026
హార్ముజ్‌లో హై టెన్షన్.. చిక్కుకున్న 15 భారత నౌకలు

హార్ముజ్ జలసంధి వద్ద ప్రస్తుతం 15 భారత నౌకలు చిక్కుకుపోయాయి. వీటిలో LPG, LNG, చమురు, కెమికల్ ట్యాంకర్లు ఉండటంతో దేశీయంగా ఆందోళన నెలకొంది. పరిస్థితిని గమనిస్తున్న ఇండియన్ నేవీ 6 యుద్ధనౌకలను రంగంలోకి దించి సమన్వయం చేస్తోంది. ఇరాన్‌తో శాంతి చర్చలు విఫలమవడంతో పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్‌లోని ఇరాన్ పోర్టులను దిగ్బంధిస్తామని ట్రంప్ ప్రకటించడం హార్ముజ్‌లో మళ్లీ హై టెన్షన్‌కు కారణమైంది.
News April 13, 2026
విజయశాంతిరెడ్డి ఆత్మహత్య.. భర్త సంచలన ఆరోపణలు

TG: హైదరాబాద్‌లోని చర్లపల్లిలో రెండు నెలల కిందట పిల్లలతో కలిసి <<19059157>>ఆత్మహత్య<<>> చేసుకున్న విజయశాంతిరెడ్డి భర్త సురేందర్ సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య కుటుంబీకుల వేధింపుల వల్లే వారు సూసైడ్ చేసుకున్నారని చెప్పారు. ‘నా అత్త పుష్పలత, బావమరిది చిరంజీవి నమ్మించి మోసం చేశారు. విజయ చనిపోయిన నాటి నుంచి ఆస్తుల కోసం నన్ను వేధించారు. వారి నుంచి నాకు ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించాలి’ అని పోలీసులను కోరారు.
News April 13, 2026
మంచం మీద కూర్చొని ఎందుకు తినకూడదు?

ఇంట్లో ఆదాయం పెరగాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా జ్యోతిష నియమాలు పాటించాలని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. మంచం మీద కూర్చొని భోజనం చేయడం దరిద్రాన్ని ఆహ్వానించినట్టేనని అంటున్నారు. ‘ఇలా తినడం వల్ల అన్నపూర్ణ దేవికి కోపం వస్తుంది. ఫలితంగా డబ్బు రాక నిలిచిపోతుంది. ఇది ఇంట్లో ప్రతికూలతను పెంచుతుంది. వాస్తు దోషాలను సృష్టించి పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. ఆర్థిక నష్టాలు కలగవచ్చు’ అని వివరిస్తున్నారు.


