News June 27, 2024
ఉంగుటూరు: రోడ్డు ప్రమాదంలో TDP మహిళా నేత మృతి

ఉంగుటూరు టీడీపీ మండల అధ్యక్షురాలు రమ్యకృష్ణ బుధవారం షిరిడీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. 2024 ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అయితే షిరిడీ వస్తానని ఆమె మొక్కుకున్నారు. ఆ మేరకు మొక్కులు తీర్చుకొని తిరిగి బయలుదేరిన సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మహిళా నేత మృతిపై చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు.
Similar News
News January 23, 2026
ఓటు నమోదులో యువతే లక్ష్యం: కలెక్టర్

ఎన్నికల ప్రక్రియలో యువతను భాగస్వాములను చేయడమే లక్ష్యమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బాలాజీ అన్నారు. జనవరి 25న జరగనున్న 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మచిలీపట్నంలో ప్రభుత్వ ఉద్యోగులతో ఆయన ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేస్తామని సిబ్బంది ప్రమాణం చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
News January 23, 2026
గన్నవరంలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం

దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సును విజయవంతంగా ముగించుకుని వచ్చిన CM చంద్రబాబుకు గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. మంత్రి కొల్లు రవీంద్రతో పాటు పలువురు నేతలు ఆయనకు పూలమాలలతో స్వాగతం పలికారు. ఈ పర్యటనలో దాదాపు రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయని, వీటి ద్వారా రాష్ట్ర యువతకు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రులు హర్షం వ్యక్తం చేశారు.
News January 23, 2026
ముఖ్యమంత్రిని కలిసిన గన్నవరం ఎమ్మెల్యే

దావోస్ పర్యటన ముగించుకుని సీఎం నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం ఉండవల్లికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా వచ్చిన సీఎంకు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సహచరులతో కలిసి ఘన స్వాగతం పలికారు. నాలుగు రోజుల దావోస్ పర్యటనలో 36కి పైగా కీలక సమావేశాల్లో పాల్గొని ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులతో చర్చలు జరిపారని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు.


