News June 27, 2024
కష్టాల్లో అఫ్గానిస్థాన్

టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అఫ్గాన్ పీకల్లోతు కష్టాల్లో పడింది. సౌతాఫ్రికా పేసర్లు నిప్పులు చెరిగే బంతులు వేస్తుండటంతో అఫ్గానిస్థాన్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పడుతున్నారు. ఓపెనర్లు గుర్బాజ్(0), ఇబ్రహీం(2)తో పాటు గుల్బాదిన్(9), నబీ(0), ఖరోటే(2) తీవ్రంగా నిరాశపరిచారు. సఫారీ బౌలర్లలో జాన్‌సెన్ 3, రబాడ 2 వికెట్లు తీశారు. దీంతో అఫ్గాన్ 5 ఓవర్లకు 23 పరుగులకే కీలక 5 వికెట్లు కోల్పోయింది.
Similar News
News April 18, 2026
మరో ఆపరేషన్ సిందూర్‌కు గెట్ రెడీ: సీడీఎస్

ఆపరేషన్ సిందూర్ నెక్స్ట్ ఫేజ్‌కు భారత దళాలు సిద్ధంగా ఉండాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ పిలుపునిచ్చారు. రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలన్నారు. త్రివిధ దళాల మధ్య సమన్వయం ఇంకా మెరుగవ్వాలని సూచించారు. ఆపరేషన్స్‌లో పైచేయి సాధించేందుకు ఆర్మీ సమాచార సేకరణపై దృష్టిపెట్టిందన్నారు. OPSకు త్వరలో ఏడాది (మే 7) పూర్తికానున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
News April 18, 2026
బీజేపీ నుంచే అత్యల్పంగా మహిళా ఎంపీలు: మహువా

మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు వీగిపోవడంతో విపక్షాలపై PM మోదీ సహా BJP నేతలు చేస్తున్న విమర్శలకు TMC MP మహువా మొయిత్రా Xలో కౌంటరిచ్చారు. లోక్‌సభలో BJP నుంచే అత్యల్పంగా మహిళా MPలు(240 మందిలో 31 మంది.. 12.90%) ఉన్నారని గుర్తు చేశారు. తమ పార్టీ నుంచి గెలిచిన 29 మంది MPల్లో 11 మంది మహిళలు(37.90%) అని పేర్కొన్నారు. ఇప్పుడున్న 543 సీట్లకు ఉమెన్ రిజర్వేషన్ అమలు చేయకుండా ఎవరు ఆపుతున్నారని ప్రశ్నించారు.
News April 18, 2026
‘పదహారణాల’ తెలుగమ్మాయి అంటే?

అచ్చమైన తెలుగు సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబిస్తే పదహారణాల తెలుగమ్మాయి అని అంటాం. ఒక కంప్లీట్ ఉమెన్ అని అర్థం. పూర్వం 16 అణాలు కలిస్తే ఒక పూర్తి రూపాయి. తన భాష, భావన, నడక, నడత, ఆహార్యం, వస్త్ర ధారణ తదితర 16 అంశాల్లో తెలుగుదనాన్ని నింపుకున్న అమ్మాయిని మన కవులు ఇలా పోల్చారు.
* ఒక బేడా= 2 అణాలు. ఒక పరకా=1/2 అణా, ఒక కాని=1/4 అణా, ఒక దమ్మిడి= 1/12 అణా.
<<-se>>#EPICSAYINGS<<>>


