News June 27, 2024

IND vs ENG: ఫైనల్ చేరేదెవరో?

image

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఇవాళ భారత్, ఇంగ్లండ్ మధ్య సెమీఫైనల్ జరగనుంది. గయానాలోని డారెన్ సామి స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. T20WC-2022 సెమీఫైనల్ ఓటమికి ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. మరోవైపు బట్లర్ సేన అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉండి టీమ్ ఇండియాకు సవాల్ విసిరేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News February 1, 2026

పన్నుల వాటా: APకి ₹64362 కోట్లు, TGకి ₹33180 కోట్లు

image

FY26-27కి యూనియన్ ట్యాక్స్‌లు, డ్యూటీ నికర ఆదాయాల నుంచి రాష్ట్రాల వారీగా పంపిణీ అయ్యే నిధులను కేంద్రం బడ్జెట్లో ప్రకటించింది. ఏపీకి ₹64362 CR, ₹33180 CR అందనున్నాయి. గతేడాదిలో APకి ₹56373 CR, TGకి ₹29280 CR రివైజ్డ్ కేటాయింపుల్లో చూపింది. కాగా యూపీకి ₹268910 CR బిహార్‌కు ₹151831 CR, మధ్యప్రదేశ్‌కు ₹112133CR మహారాష్ట్ర కు ₹98306CR రాజస్థాన్‌కు ₹90445CR కేటాయించింది.

News February 1, 2026

రక్షణ రంగానికి కేటాయింపులు పెంపు

image

2026 బడ్జెట్‌లో రక్షణ రంగానికి రూ.7.85 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాది కంటే రూ.1.04 లక్షల కోట్లు అధికం. ఆయుధాల ఆధునికీకరణకు రూ.2.19 లక్షల కోట్లు(21.84% పెంపు), రోజువారీ నిర్వహణకు 17.24% అదనపు నిధులు ఇచ్చారు. పెన్షన్ల కోసం రూ. 1.71 లక్షల కోట్లు కేటాయించారు. GDPలో రక్షణ వ్యయం 8% నుంచి 11% పెరిగింది. సరిహద్దు సవాళ్ల నేపథ్యంలో సైనిక సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ భారీ కేటాయింపులు జరిగాయి.

News February 1, 2026

120 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

BSNLలో 120 సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. టెలికంలో 95, ఫైనాన్స్‌లో 25 ఉద్యోగాలున్నాయి. జాబును బట్టి BE/BTech(ఎలక్ట్రానిక్స్& టెలికమ్యూనికేషన్స్), CA/CMA పాసైన వారు అర్హులు. వయసు 21- 30ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఫిబ్రవరి 5 నుంచి మార్చి 7 వరకు అప్లై చేసుకోవచ్చు.
వెబ్‌సైట్: https://bsnl.co.in/