News June 27, 2024

అనంతలో డయేరియా కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు

image

అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సరోజన ఆసుపత్రిలో 15 పడకలతో డయేరియా కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు సూపర్ హిట్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా డయేరియా కేసులు అధికం అవుతుండటంతో మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. డయేరియా పట్ల నిర్లక్ష్యం వహించకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.

Similar News

News March 11, 2025

క్యూట్.. Pic Of The Day

image

కదిరిలో శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి నారా లోకేశ్ ఓ చిన్నారిని ఎత్తుకుని ఆడించారు. పర్యటన ముగించుకుని వెళ్తున్న క్రమంలో తన కాన్వాయ్ వద్దకు అభిమానులు చిన్నారిని తీసుకొచ్చారు. ఆయన చిన్నారిని ఎత్తుకుని ముద్దాడారు. ఇందుకు సంబంధించిన క్యూట్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిక్ ఆఫ్ ది డే అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

News March 11, 2025

మీ ఊర్లో నీటి సమస్య ఉందా?

image

ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అనంతపురం జిల్లాలో 35°Cల ఉష్ణోగ్రత నమోదవుతోంది. పలు మున్సిపాలిటీలు, గ్రామాల్లో నీటి సమస్య మొదలవుతోంది. ఈ ఏడాది నీటి ఎద్దడి నివారణకు అధికారులు ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. జిల్లాలో 577 పంచాయతీలు ఉండగా నిధులు రాగానే ఉండగా సమస్య ఉన్నచోట ట్యాంకర్లతో సరఫరా, బోర్ల మరమ్మతులు, నూతన పైప్‌లైన్ పనులు చేపట్టనున్నారు. మరి మీ ఊర్లో నీటి సమస్య ఉందా? కామెంట్ చేయండి.

News March 11, 2025

మంత్రిత్వ శాఖ జూమ్ మీటింగ్‌లో పాల్గొన్న కలెక్టర్

image

న్యూఢిల్లీ నుంచి భారత ప్రభుత్వం, జల్ శక్తి మంత్రిత్వ శాఖవారు జల్ శక్తి అభియాన్ “జల్ సంచయ్ జన్ భగీదారి”పై అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. “జెల్ సంచయ్ జన్ భగీదారి”పై దృష్టి సారించి వర్షాన్ని ఒడిసి పట్టీల చర్యలు చేపట్టాలని సోమవారం అన్నారు. జిల్లాలలో పురోగతిపై వర్చువల్ విధానంలో జల్ శక్తి మంత్రిత్వ శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమీక్ష నిర్వహించారు.

error: Content is protected !!