News June 27, 2024
హెల్మెట్ లేకుంటే ఉపేక్షించొద్దు: హైకోర్టు సీరియస్

AP: వాహన చోదకులు హెల్మెట్ ధరించేలా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసులను హైకోర్టు ఆదేశించింది. హెల్మెట్ లేకపోవడం వల్ల సంభవిస్తున్న మరణాల దృష్ట్యా ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలంది. ట్రాఫిక్ పోలీసులు బాడీవోర్న్ కెమెరాలు ధరించాల్సిన అవసరముందని పేర్కొంది. వాహన చట్ట నిబంధనలను అమలు చేసేందుకు తీసుకున్న చర్యలను కోర్టుకు తెలపాలని ఆదేశించింది. ఈ అంశంపై పిటిషన్ వేసిన వ్యక్తిని అభినందించింది.
Similar News
News April 10, 2026
తగ్గిన గోల్డ్ రేట్స్

బంగారం ధరలు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ <<19612964>>ఉదయం<<>> పెరిగిన రేట్లు తాజాగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.650 తగ్గి రూ.1,52,350కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.600 దిగివచ్చి రూ.1,39,650గా ఉంది. అటు కేజీ వెండి ధర రూ.2,65,000గా కొనసాగుతోంది.
News April 10, 2026
‘చండ శాసనుడు’ అంటే ఎవరు?

నియంతృత్వ పోకడలతో ఎవరి మాటా వినకుండా కఠినంగా పరిపాలించే నాయకులను, నిర్దయగా వ్యవహరించే అధికారులను ‘చండ శాసనుడు’ అని పిలుస్తున్నాం. ఇదేమీ మనిషి పేరు కాదు. అతని స్వభావం. చండము అంటే కోపము. శాసనం అంటే ఆజ్ఞ, పాలన, శిక్ష. చరిత్రలోని క్రూరమైన రాజులను ఈ పేరుతో పిలిచే వారు. కాలక్రమంలో ఇదొక నానుడిగా మారింది. మీకు తెలిసిన చండ శాసనుడు ఎవరో కామెంట్ చేయండి.
<<-se>>#EPICSAYINGS<<>>
News April 10, 2026
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా?

కొత్త దుస్తులను ఉతకకుండా ధరించడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘వీటి తయారీలో వాడే రంగులు, ఫార్మాల్డిహైడ్ వంటి రసాయనాలు, షోరూమ్‌లలో ఇతరులు ట్రయల్ వేయడం వల్ల చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి, వారి దుస్తులను కచ్చితంగా ఉతికిన తర్వాతే వేయాలి’ అని సూచిస్తున్నారు. SHARE IT


