News June 27, 2024

HYD: ఇంటర్, డిగ్రీ, పీజీ పాసయ్యారా .. ఇది మీ కోసమే..!

image

సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ విమలా రెడ్డి తెలిపారు. బుధవారం HYD నల్లకుంటలో ఆమె మాట్లాడారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. జులై 6లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 7893141797 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
SHARE IT

Similar News

News July 5, 2025

HYDలో అత్యధికంగా బియ్యం పంపిణీ

image

రాష్ట్రంలో మూడు నెలల సన్న బియ్యం పంపిణీ ముగిసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 13,61,691 కార్డులు ఉండగా 14,25,303 మంది, HYDలో మొత్తం 6,47,282 కార్డులు ఉండగా 6,83,525 మంది బియ్యం తీసుకున్నారు. MDCLలో 112.66 శాతం, HYDలో 105.59 శాతం, RRలో 106.16 శాతం మంది బియ్యం తీసుకున్నారు. నగరంలో రేషన్ షాపులకు కేటాయించిన కార్డుల కంటే ఎక్కువ బియ్యం పంపిణీ జరిగింది. తిరిగి సెప్టెంబర్‌లో పంపిణీ చేయనున్నారు.

News July 5, 2025

HYD: హెక్టార్‌లో 2 టన్నుల కంది దిగుబడి

image

గరిష్ఠ ఉష్ణోగ్రతలు తట్టుకొని, ఒక హెక్టార్‌లో 2 టన్నులు దిగుబడి ఇచ్చే కంది వంగడాన్ని ICPV 25444 పేరుతో ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. 45 డిగ్రీల సెల్సియ ఉష్ణోగ్రతల వద్ద సైతం ఇది తట్టుకుంటుంది. 125 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఖరీఫ్ రబీ సీజన్‌లో ఎప్పుడైనా పంట పండించవచ్చు. తాండూరు, వికారాబాద్, సంగారెడ్డి ప్రాంతాలు ఈ పంట రకానికి అనుకూలమని అధికారులు డైరెక్టర్ హిమాన్షు తెలిపారు.

News July 5, 2025

HYD: GHMC వెబ్‌సైట్‌లో ఈ సదుపాయాలు

image

ఆస్తి పన్నుకు సంబంధించి ప్రజల సౌకర్యార్థం కొన్ని సదుపాయాలను GHMC వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు అడిషనల్ కమిషనర్ అనురాగ్ జయంతి తెలిపారు. ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్ మెంట్, రివిజన్, వేకెన్సీ రెమిషన్, యజమాని పేరు కరెక్షన్, డోర్ నెంబర్ కరెక్టన్, అసెస్ మెంట్ మినహాయింపు, ప్రాపర్టీ టాక్స్ సెల్ఫ్ అసెస్మెంట్ ఉన్నాయన్నారు. ప్రజలు ఈ సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు.