News June 27, 2024
జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు

కేంద్రం రూపొందించిన కొత్త నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం జులై 1 నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చు. జీరో FIR ప్రకారం ఏ వ్యక్తి అయినా PS పరిధితో సంబంధం లేకుండా ఏ PSలోనైనా ఫిర్యాదు చేయొచ్చు. మహిళలు, చిన్నారులపై నేరాల దర్యాప్తు 2నెలల్లో పూర్తి చేయాలి.
Similar News
News April 9, 2026
కఠినాత్ముల మనస్సు కరిగించలేం!

వంపుకర్రగాచి వంపు తీర్చగవచ్చు
కొండలన్ని పిండిగొట్టవచ్చు
కఠినచిత్తు మనసు కరిగింపగా రాదు
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: వంపుగా ఉన్న కర్రను వేడి చేసి తిన్నగా చేయవచ్చు. కొండలను కూడా పిండి చేయవచ్చు. కానీ మొండి పట్టుదల లేదా కఠినాత్ముల మనస్సును కరిగించడం సాధ్యం కాదు.
<<-se>>#PADHYAM<<>>
News April 9, 2026
‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌లో ‘కపుల్ ఫ్రెండ్లీ’ బ్యూటీ?

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలోని స్పెషల్ సాంగ్‌లో యంగ్ హీరోయిన్ మానస వారణాసి స్టెప్పులు వేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సాంగ్ కోసం మూవీ టీమ్ ఆమె పేరును పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ బ్యూటీ ఇటీవల ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో యూత్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. కాగా స్పెషల్ సాంగ్‌లో మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారని ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
News April 9, 2026
కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో నేడే పోలింగ్

కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో ఈరోజు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటింగ్ ఉ.7 గంటలకు ప్రారంభమై సా.6 గంటలకు ముగుస్తుంది. కేరళంలో 140, అస్సాంలో 126, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కేరళంలో LDF, UDF మధ్య ప్రధాన పోటీ ఉంది. ఇక్కడ పినరయి విజయన్ నాయకత్వంలోని LDF, అస్సాంలో NDA హ్యాట్రిక్‌పై కన్నేశాయి. పుదుచ్చేరిలో NDA, INC-DMK కూటమి మధ్య ప్రధాన పోటీ ఉంది.


