News June 27, 2024
HYD: EVDM కమిషనర్‌గా రంగనాథ్ బాధ్యతల స్వీకరణ

GHMC ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఈవీడీఎం) కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు HYD బుద్ధభవన్‌లోని కమిషనర్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది నూతన కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన ఉద్యోగ బాధ్యతలను కూడా ఎప్పటిలాగానే విజయవంతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు.
Similar News
News September 15, 2025
HYD: రూ.1.09 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఈగల్ టీమ్

మత్తు పదార్థాలను తరలించే ముఠాలపై తెలంగాణ ఈగల్ టీమ్ ఉక్కుపాదం మోపింది. జీఆర్పీ, ఆర్పీఎఫ్, స్థానిక పోలీసులతో కలిసి గతనెల 22 నుంచి ఈ నెల 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సంయుక్త ఆపరేషన్లు నిర్వహించింది. ఇందులో 12 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.1.09 కోట్ల విలువైన డ్రగ్స్, గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.
News September 13, 2025
రంగారెడ్డి: ఈనెల 15న జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక

రంగారెడ్డి జిల్లా సబ్ జూనియర్ కబడ్డీ బాల, బాలికల జట్ల ఎంపిక ఈ నెల 15న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరగనుంది. జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ.. ఎంపికైన క్రీడాకారులు నిజామాబాద్ జిల్లాలో జరిగే అంతర్ జిల్లా కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. 55 కిలోల బరువు లోపు ఉన్న క్రీడాకారులు మాత్రమే ఈ ఎంపికకు అర్హులని పేర్కొన్నారు.
News September 13, 2025
‘గాంధీ ఆసుపత్రిని మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా’

గాంధీ ఆసుపత్రిని మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని నూతన సూపరింటెండెంట్ డాక్టర్ వాణి అన్నారు. శుక్రవారం ఆమె బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడారు. ఆసుపత్రిలో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని పూర్తిగా పరిశీలించి, పరిస్థితులను మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.