News June 27, 2024
రేపు వరంగల్, హనుమకొండలో సీఎం రేవంత్ పర్యటన

TG: సీఎం రేవంత్‌రెడ్డి రేపు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. హనుమకొండ ఐడీఓసీ కార్యాలయంలో జరిగే వనమహోత్సవంలో పాల్గొంటారు. అనంతరం ఉన్నతాధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షిస్తారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు, భూగర్భ డ్రైనేజీ, రింగ్ రోడ్డు, మామునూరు ఎయిర్‌పోర్ట్, కాళోజీ కళాక్షేత్రం తదితర అంశాలపై చర్చిస్తారు. ఆ తర్వాత కాకతీయ మెగా జౌళి పార్కు, నయీంనగర్ నాలా తదితర ప్రాంతాలను సందర్శించనున్నారు.
Similar News
News April 10, 2026
యూత్‌లో గుండె జబ్బులు.. భారంగా మారుతున్న ఇన్సూరెన్స్!

గతంలో 50 ఏళ్లు దాటాక వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు 20 ఏళ్లకే వస్తున్నాయి. దీంతో ఇన్సూరెన్స్ కంపెనీలు రిస్క్ ఎక్కువని భావించి ప్రీమియం ధరలను 50% వరకు పెంచే యోచనలో ఉన్నట్లు ప్లమ్ సంస్థ డేటా వెల్లడించింది. అంటే గతంలో కంటే ఇప్పుడు పాలసీ కోసం ఎక్కువ డబ్బులు కట్టాలి. అందుకే సరైన టైమ్‌లో ఇన్సూరెన్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే ఆస్పత్రి ఖర్చులన్నీ సొంతంగా భరించాల్సి వస్తుందంటున్నారు.
News April 10, 2026
‘భోగాపురం’ ప్రారంభానికి రండి.. మోదీకి CBN ఆహ్వానం

AP: జులై/ఆగస్టులో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకకు రావాలంటూ ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. జులై 5 లేదా 8న, ఆగస్టు 17 లేదా 19 తేదీల్లో సమయం ఇవ్వాలని కోరారు. జూన్ 30 లోగా పనులు పూర్తి చేయాలని ఇప్పటికే కేంద్రం ఆదేశించినట్లు సమాచారం.
News April 10, 2026
మే 1 నుంచి థియేటర్లు బంద్?

తెలంగాణ(నైజాం)లో మే 1 నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసేసే యోచనలో ఎగ్జిబిటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. పర్సెంటేజీ విధానాన్ని నిర్మాతలు తిరస్కరించడంతో ఇలా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆదాయాన్ని అలా పంపిణీ చేస్తేనే మూవీస్ ప్రదర్శిస్తామని, ఈనెల 30 లోగా నిర్ణయం తీసుకోవాలని ఫిలిం ఛాంబర్ స్పష్టం చేసిందని టాక్. రెంటల్ స్థానంలో <<19548702>>పర్సెంటేజీ విధానం<<>> అమలు చేయాలని 23 థియేటర్ల యాజమాన్యాలు ఇటీవల నిర్ణయించాయి.


