News June 27, 2024

‌ఇన్‌స్టాగ్రామ్‌లో యువతి మార్ఫింగ్ ఫొటోలు

image

‌ఇన్‌స్టాగ్రామ్‌లో యువతి ఫొటోలను పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్న యువకుడిని కల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ ఫణీందర్ వివరాలు.. కల్లూరు మండలం వెన్నవల్లికి చెందిన వెంకటకృష్ణ అదే గ్రామానికి చెందిన ఓ యువతి పేరు మీద ‌ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతా ఓపెన్ చేశాడు. అందులో ఆ యువతి మార్ఫింగ్ ఫొటోలను అప్లోడ్ చేసి బెదిరిస్తున్నాడు. యువతి ఫిర్యాదు మేరకు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Similar News

News July 3, 2024

ఖమ్మం: తలలో గుచ్చుకున్న పెన్ను.. చికిత్స సక్సెస్!

image

ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అరుదైన చికిత్స జరిగింది. భద్రాచలానికి చెందిన 5 ఏళ్ల చిన్నారి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు <<13550256>>తలలో పెన్ను గుచ్చుకొని <<>>కోమాలోకి వెళ్లింది. దీంతో హుటాహుటిన తల్లిదండ్రులు చిన్నారిని నగరంలోని ఓ ఆసుపత్రికి తరలించగా, సుమారు 4 గంటల పాటు వైద్యులు శ్రమించి తలలో గుచ్చుకున్న పెన్నును విజయవంతంగా తీశారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది.

News July 3, 2024

కొత్త చట్టాలతో బాధితులకు న్యాయం: సీపీ

image

దేశవ్యాప్తంగా జులై 1నుంచి అమల్లోకి వచ్చిన కొత్త చట్టాల ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా సీపీ సునీల్ దత్ వెల్లడించారు. బాధితుడు ఎస్‌ఎంఎస్, వాట్సాప్, ఈ – మెయిల్‌ ఇతర సామాజిక మాధ్యమాలు వేటి ద్వారానైనా ఫిర్యాదు చేయవచ్చన్నారు. బాధితులు కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజలు అపోహలకు తావివ్వకుండా కొత్త చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు.

News July 3, 2024

రైతు ఆత్మహత్య ఘటన.. పదిమందిపై కేసు నమోదు

image

తన పొలాన్ని ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ సోమవారం చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన <<13548972>>రైతు బోజడ్ల ప్రభాకర్‌ సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై మృతుడి తండ్రి వీరభద్రయ్య ఫిర్యాదు మేరకు ఖానాపురం హవేలి పోలీసు స్టేషన్‌లో పదిమందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్‌ భానుప్రకాశ్‌ వివరించారు.