News June 27, 2024

నిలకడగా అద్వానీ ఆరోగ్యం

image

అస్వస్థతతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన బీజేపీ సీనియర్ నేత ఎల్‌కె.అద్వానీ(96) ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనను వృద్ధాప్య విభాగం వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మూడు నెలల క్రితం ఆయనను కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డుతో సత్కరించింది.

Similar News

News April 6, 2026

GK: ముఖ్య పదవులు.. కనీస వయసు

image

*రాష్ట్రపతి- 35 ఏళ్లు
*ఉపరాష్ట్రపతి- 35
*గవర్నర్- 35
*ఎమ్మెల్సీ- 30
*రాజ్యసభ సభ్యుడు- 30
*ప్రధాని- 25
*లోక్‌సభ ఎంపీ- 25
*ఎమ్మెల్యే- 25
*సీఎం- 25
*సర్పంచ్- 21

News April 6, 2026

తొలి హిందీ సినిమాగా ధురంధర్-2 రికార్డు

image

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ధురంధర్-2 చరిత్ర సృష్టించింది. దేశంలో రూ.1,000 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిన తొలి హిందీ సినిమాగా ఘనత సాధించింది. నిన్న 18వ రోజు దేశవ్యాప్తంగా 4,030లు షోలు పడగా రూ.3.82 కోట్ల నెట్ వసూలు చేసింది. కాగా ఇండియాలో అత్యధిక నెట్ కలెక్షన్లు (రూ.1,234 కోట్లు) సాధించిన రికార్డు పుష్ప-2 పేరిట ఉంది. ఆ తర్వాత బాహుబలి-2 రూ.1,030 కోట్లతో రెండో స్థానంలో ఉంది.

News April 6, 2026

అమెరికా పిచ్చి పనులు చేస్తే.. ఇరాన్ వార్నింగ్

image

మంగళవారం రాత్రి లోగా హార్ముజ్ తెరవకపోతే ఇరాన్‌ను నాశనం చేస్తామన్న ట్రంప్ హెచ్చరికలపై సుప్రీం లీడర్ మొజ్తబా అడ్వైజర్ అలీ అక్బర్ దీటుగా స్పందించారు. ‘అమెరికా పిచ్చి పనులు చేస్తే హార్ముజ్ లాగే బాబ్-అల్-మండెబ్ మూతపడుతుంది’ అని స్పష్టం చేశారు. ఎర్ర సముద్రంలోని బాబ్-అల్-మండెబ్ ఆయిల్, ఇతర వస్తువుల రవాణాకు ఎంతో కీలకం. హార్ముజ్ మూసివేతతో సౌదీ ఇక్కడి నుంచే ఆయిల్ ఎగుమతి చేస్తోంది.