News June 27, 2024
కీలక నిర్ణయం.. పాస్ పుస్తకాలు వెనక్కి తీసుకోనున్న ప్రభుత్వం

AP: YCP హయాంలో జగన్ ఫొటోతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని GOVT నిర్ణయించింది. పంపిణీ చేసిన 20.19లక్షల భూహక్కు పత్రాలు, పంచాల్సిన మరో లక్ష పత్రాలను నిలిపివేశారు. దీనిపై అధికారులతో మంత్రి సత్యప్రసాద్ చర్చించారు. అందరికీ కలిపి కొత్త పాస్ పుస్తకాలివ్వాలని నిర్ణయించారు. రాజముద్రతో కొత్త పుస్తకాల డిజైన్లను తయారు చేసి, CM చంద్రబాబు ఆమోదం తర్వాత పంపిణీపై నిర్ణయం తీసుకోనున్నారు.
Similar News
News April 11, 2026
IPL: దుమ్మురేపుతున్న కాటేరమ్మ కొడుకులు

పంజాబ్‌తో మ్యాచులో SRH ఓపెనర్లు అభిషేక్ శర్మ(22 బంతుల్లో 66*), ట్రావిస్ హెడ్(15 బంతుల్లో 31*) రెచ్చిపోతున్నారు. వీరిద్దరూ బౌలర్లపై నువ్వా-నేనా అన్నట్లు విరుచుకుపడుతున్నారు. దీంతో పవర్‌ప్లే(6 ఓవర్ల)లో SRH ఏకంగా 105 రన్స్ చేసింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక పవర్ ప్లే స్కోర్. ఇక ఓవరాల్‌గా పవర్ ప్లేలో హయ్యెస్ట్ రన్స్(125/0) కూడా SRH పేరిటే ఉంది. 2024 ఐపీఎల్‌లో DCపై ఈ రికార్డ్ స్కోర్ చేసింది.
News April 11, 2026
‘అడుగులకు మడుగులు వత్తడం’ అంటే?

ఒక వ్యక్తిని గుడ్డిగా అనుసరిస్తూ, అతని మాటకు ఎదురుచెప్పకుండా పనులు చేసే వారి గురించే చెప్పేటప్పుడు దీన్ని వాడుతున్నాం. అడుగు=పాదం, మడుగు=గుడ్డ, వత్తడం=పరచడం. పూర్వం రాజులు, రాణులు బయలుదేరినప్పుడు సేవకులు వారి కొంగులను పట్టుకొనేవారు. కాళ్లకు నొప్పి తెలియకుండా తడి దుస్తులను పరిచేవారు. కాలక్రమంలో ఇదొక జాతీయమైంది. ఇప్పుడు బానిసత్వానికి ప్రతీకగా ఉపయోగిస్తున్నాం.
<<-se>>#EPICSAYINGS<<>>
News April 11, 2026
పెట్స్‌తో సెలబ్రిటీల క్యూట్ పిక్స్!

ఇవాళ నేషనల్ పెట్స్ డే. ఈ సందర్భంగా సినీ తారల పెట్స్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విదేశాలకు వెళ్లినా తన పెట్ ‘రైమీ’ని తీసుకెళ్తుండటం విశేషం. విజయ్ దేవరకొండ సైతం తన సైబీరియన్ హస్కీని ఫ్యామిలీ మెంబర్‌లా చూసుకుంటారు. మహేశ్‌బాబు, ప్రియాంకా చోప్రా, ఆలియా భట్, అనుష్క శర్మ, నజ్రియా, విక్రమ్, అమలా పాల్, కీర్తి సురేశ్, మోహన్ లాల్‌ల పెట్స్‌ను పై ఫొటోల్లో చూడొచ్చు.


