News June 27, 2024
అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు

T20WC 2వ సెమీఫైనల్‌లో ఈ రోజు ఇంగ్లండ్‌ను భారత్ ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో గత T20WCలో ఇండియాVSఇంగ్లండ్ మ్యాచ్ పలువుర్ని కలవరపెడుతోంది. అందులో ఇంగ్లండ్ ఓపెనర్లే లక్ష్యాన్ని ఛేదించారు. అయితే టీమ్ఇండియాలో అప్పటికి, ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు బుమ్రా, జడేజా, కుల్దీప్ చేరికతో బౌలింగ్ లైనప్ బలంగా ఉంది. మరోవైపు ఇంగ్లండ్‌లో స్టోక్స్, వోక్స్, హేల్స్ వంటి అనుభవజ్ఞులు లేరు.
Similar News
News December 30, 2025
MOIL లిమిటెడ్ 67 పోస్టులకు నోటిఫికేషన్

<
News December 30, 2025
ICC ర్యాకింగ్స్: టాప్-10లో ముగ్గురు ఇండియన్స్

ఐసీసీ తాజాగా విడుదల చేసిన T20I ఉమెన్స్ ర్యాంకింగ్స్‌లో షెఫాలీ వర్మ సత్తా చాటారు. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో సూపర్ ఫామ్ కొనసాగిస్తున్న ఆమె ఏకంగా 4 స్థానాలు ఎగబాకి 736 పాయింట్లతో 6వ ర్యాంక్ సొంతం చేసుకున్నారు. షెఫాలీ సహా టాప్ 10లో టీమ్ ఇండియా నుంచి ముగ్గురు ప్లేయర్స్ ఉండటం విశేషం. తొలిస్థానంలో ఆసీస్ ప్లేయర్ బెత్ మూనీ(794) ఉండగా రెండో స్థానంలో స్మృతి మంధాన(767), పదో స్థానంలో జెమీమా(643) ఉన్నారు.
News December 30, 2025
నిమ్మ తోటల్లో అంతర పంటలతో అధిక ఆదాయం

నిమ్మ తోటల్లో తొలి ఐదేళ్లు అంతర పంటలను సాగు చేసి రైతులు అదనపు ఆదాయం పొందవచ్చు. అంతర పంటలతో కలుపు ఉద్ధృతి కూడా తగ్గుతుంది. వేరుశనగ, పెసర, మినుము, చిక్కుడు, బీన్స్, బంతి, దోస, పుచ్చ, బీర, కాకర, ఉల్లిని అంతర పంటలుగా వేసుకోవచ్చు. టమాటా, మిరప, వంగ, బెండ, పొగాకు లాంటి పంటలు అంతర పంటలుగా వేస్తే నులు పురుగులు వచ్చే అవకాశం ఉంది కావున వాటిని అంతర పంటలుగా వేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.


