News June 27, 2024

వరంగల్ మార్కెట్‌లో మిర్చి ధరల వివరాలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం ఏసీ తేజ మిర్చి ధర క్వింటా రూ.18,500 పలికింది. అలాగే ఏసీ 341 రకం మిర్చి రూ.17,000, వండర్ హాట్ (WH) మిర్చి రూ.17,500 ధర పలికాయి. కాగా నిన్నటితో పోలిస్తే తేజ మిర్చి రూ.500 పెరగగా.. అన్ని రకాల మిర్చి ధరల్లో నిన్నటి లాగే తటస్థంగా ఉన్నాయి. మార్కెట్లో క్రయ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.

Similar News

News October 9, 2024

వరంగల్: రేపటి నుంచి ఎనుమాముల మార్కెట్‌కు సెలవులు

image

వరంగల్ నగరంలోని ఎనుమాముల మార్కెట్‌కు రేపటి నుంచి నాలుగు రోజులు వరుసగా సెలవులు ప్రకటిస్తున్నామని మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి పి. నిర్మల ఒక ప్రకటనలో తెలిపారు. రేపు దుర్గాష్టమి, ఎల్లుండి మహార్నవమి, 12న విజయదశమి, 13న ఆదివారం సందర్భంగా మార్కెట్ బంద్ ఉంటుందన్నారు. కాబట్టి రైతులు మార్కెట్‌కు రాకూడదని పేర్కొన్నారు. ఈనెల 14న మార్కెట్ పునః ప్రారంభమవుతుందని తెలిపారు.

News October 9, 2024

BHPL: 12వ తేదీన రావణసుర వధ కార్యక్రమం

image

గోరి కొత్తపల్లి మండల కేంద్రంలో స్నేహ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 12వ తేదీన రాత్రి 8 గంటలకు రావణాసుర వాద కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు యూత్ అధ్యక్షుడు ఆవుల రాజు తెలిపారు. మండలంలో తొలిసారిగా రావణ వధ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని రాజు పిలుపునిచ్చారు.

News October 9, 2024

వరంగల్ మార్కెట్లో పత్తి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పాత పత్తి ధర నిన్నటి లాగే తటస్థంగా ఉంది. మంగళవారం క్వింటా పాత పత్తి రూ.7,450 ధర పలకగా.. నేడు కూడా రూ.7450 పలికినట్లు అధికారులు తెలిపారు. అలాగే కొత్తపత్తి ధర నిన్న రూ.6,960 పలకగా.. నేడు రూ.6,930కి తగ్గినట్లు పేర్కొన్నారు. కాగా, నేడు మార్కెట్‌‌కు పత్తి తరలివచ్చింది.