News June 27, 2024

చిరుత సంచారంపై కనిపించని అప్రమత్తత

image

మహానంది మండల పరిధిలో సంచరిస్తున్న చిరుత పులి సంచారంపై నంద్యాల కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి గ్రామంలో దండోరా వేస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. అయితే గ్రామాలలో ఎక్కడా చిరుత పులి సంచారంపై దండోరా కానీ ప్రజలను అప్రమత్తం చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.

Similar News

News July 3, 2024

BREAKING: నంద్యాలలో రైలు నుంచి కిందపడి ఇద్దరి మృతి

image

నంద్యాలలోని మూలసాగరం రైల్వే గేటు వద్ద బుధవారం ఉదయం రైలు నుంచి జారి పడి ఇద్దరు మృతి చెందారు. ప్రమాదవశాత్తూ జారిపడి మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 3, 2024

నంద్యాల: ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ.. వ్యక్తి మృతి

image

నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. కర్నూలు నుంచి వస్తున్న ఒంగోలు ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బ్రాహ్మణకొట్కూరు సమీపంలో బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో రవి(35) చెందాడు. ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News July 3, 2024

నంద్యాల: విధుల్లో ఉండగానే టీచర్ మృతి

image

విధుల్లో ఉన్న ఉపాధ్యాయుడు ఒక్కసారిగా కుప్పకూలి మంగళవారం మృతిచెందారు. ఆత్మకూరులో నివాసముంటున్న జీ.నాగలక్ష్మయ్య(58) కొత్తపల్లి మండలం కొత్తమాడుగుల ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. భోజన విరామ సమయంలో ఉన్నఫళంగా ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న ఉపాధ్యాయుడిని తోటి ఉపాధ్యాయులు ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.