News June 27, 2024
తిరుపతి: పదవుల కోసం దిగజారను : భూమన

పదవుల కోసం దిగజారే మనస్తత్వం తనది కాదని వైసీపీ నాయకుడు భూమన అభినయ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. డిప్యూటీ మేయర్, నాలుగో డివిజన్ కార్పొరేషన్ పదవికి ఎప్పుడో రాజీనామా చేసినట్టు ఆయన స్పష్టం చేశారు. తన రాజీనామాను గోప్యంగా ఉంచినట్టు కొందరు ప్రచారం చేయడం ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నారు. ఇందులో ఎటువంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. పదవులను పట్టుకొని వేలాడనని తెలిపారు.
Similar News
News January 12, 2026
చిత్తూరు కలెక్టరేట్‌లో ప్రారంభమైన PGRS

చిత్తూరు కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ సుమిత్ కుమార్ ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరించి పరిష్కార దిశగా సంబంధిత అధికారులకు ఫిర్యాదులపై బాధితుల ముందే పరిష్కరిస్తున్నారు. మండల స్థాయిలోనే ఫిర్యాదులు పరిష్కారం అవ్వాలని ఆదేశించారు. డీఆర్ఓ మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడేల్ పాల్గొని ఫిర్యాదులను స్వీకరించారు.
News January 11, 2026
నెలాఖరిన కుప్పంలో CM పర్యటన

CM చంద్రబాబు జనవరి చివర్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. జనవరి 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో CM కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పర్యటించనున్నారు. మూడు రోజుల నియోజకవర్గ పర్యటనలో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 1న కుప్పంలో నూతన పెన్షన్లను CM లబ్ధిదారులకు ఇవ్వనున్నారు.
News January 11, 2026
చిత్తూరు జిల్లా ప్రజలకు గమనిక

చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం జరగనున్న గ్రీవెన్స్ డేను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు కార్యక్రమం జరగనుందని చెప్పారు. జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలియజేస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అర్జీ నమోదు, స్థితిపై 1100కి కాల్ చేయవచ్చన్నారు.


