News June 27, 2024

ఉమ్మడి MBNR జిల్లాలో పత్తి, వరిలదే అగ్రస్థానం

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పత్తి, వరిలదే అగ్రస్థానంలో ఉందని వ్యవసాయ అధికారులు తెలిపారు. నారాయణపేటలో 4,23,800, నాగర్ కర్నూల్ 5,62,299, గద్వాల 3,40,677, మహబూబ్ నగర్ 3,21,512, వనపర్తిలో 2,35,250 ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలను సాగు చేస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు. వీటిలో పత్తి, వరి పంటలదే అగ్రస్థానం. మిగతా కంది, జొన్నలు, పెసర, వేరుశనగ, అముదం, మొక్కజొన్న తదితర పంటలను సాగు చేస్తుంటారన్నారు.

Similar News

News January 14, 2025

మల్లికార్జున స్వామికి కైలాస వాహన సేవ

image

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి శ్రీశైల క్షేత్రంలో మంగళవారం మకర సంక్రాంతి పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవార్లకు కైలాస వాహన సేవలు ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారులు, భక్తులు, స్థానికులు, తదితరులు, పెద్ద ఎత్తున స్వామివారి బ్రహ్మోత్సవ సేవలో పాల్గొన్నారు.

News January 14, 2025

MBNR: జూ.కళాశాలల్లో సమస్యలు..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సమస్యలు తాండవం చేస్తున్నాయి. బదిలీలు, ఇతర కారణాలతో మొత్తం 14 కళాశాలల్లో ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ కళాశాలలు ఇన్చార్జుల పాలనలో నడుస్తున్నాయి. వీరు వారి కళాశాలతో పాటుగా అదనపు బాధ్యతలు అప్పగించిన కళాశాలలను కూడా చూసుకోవాల్సి వస్తోంది. దీంతో అనేక పాలనాపరమైన సమస్యలు నెలకొన్నాయి. పదోన్నతుల ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయవలసి ఉంది.

News January 14, 2025

MBNR: మీ ముచ్చటైన ముగ్గులు Way2Newsలో

image

సంక్రాంతి, కనుమ సందర్భంగా మీ వాకిట్లో వేసిన మీ ముగ్గులనూ Way2Newsలో చూడాలనుకుంటే 9100153883 నంబర్‌కు వాట్సాప్ చేయండి. నోట్: ఫొటో, మీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లు కచ్చితంగా పంపగలరు. పండుగను ప్రతిబింబించే ముగ్గులు మాత్రమే (వాట్సాప్ పోస్టు) పబ్లిష్ అవుతాయి.