News June 27, 2024

NLG: కట్టు తప్పుతున్న కొందరు పోలీసులు

image

జిల్లాలోని కొందరు పోలీసుల తీరు తరచూ వివాదాస్పదమవుతోంది. వారి వ్యవహార శైలి మొత్తం పోలీసు శాఖకే మచ్చ తెస్తోంది. క్రమశిక్షణతో ఉండాల్సిన ఖాకీలు కట్టు తప్పుతున్నారు. అక్రమార్జనపై దృష్టి పెడుతున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటనలు పలు చోట్లు చోటు చేసుకుంటున్నాయి. ఇది చాలదన్నట్లు ఇంకొందరు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల శాలిగౌరారంలో ఎస్ఐ మహిళపై అనుచితంగా ప్రవర్తించిన ఘటన తెలిసిందే.

Similar News

News January 17, 2026

NLG: ఓటర్ల తుది జాబితా షెడ్యూల్ పూర్తి

image

జిల్లాలోని మున్సిపాలిటీలు, నల్గొండ కార్పొరేషన్ పరిధిలో ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాను అధికారులు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 6,66,437 మంది ఓటర్లు ఉండగా, మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. మహిళలు 3,44,661 మంది, పురుషులు 3,23,647 మంది, ఇతరులు 129 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. జాబితా విడుదల కావడంతో వార్డుల వారీగా ఓటర్ల సంఖ్యపై స్పష్టత వచ్చింది.

News January 17, 2026

NLG: నేడు ఆ రిజర్వేషన్లు ఖరారు!

image

జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పరిధిలో వార్డులు, డివిజన్ల రిజర్వేషన్లు శనివారం ఖరారు కానున్నాయి. కలెక్టరేట్‌లో కలెక్టర్ ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్ల రిజర్వేషన్లను జిల్లా స్థాయిలో ఖరారు చేస్తుండగా, మేయర్, మున్సిపల్ ఛైర్మన్‌ల రిజర్వేషన్లను రాష్ట్ర స్థాయిలో ప్రకటించనున్నారు. రిజర్వేషన్‌ల లెక్క తేలనుండటంతో జిల్లా రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

News January 16, 2026

వార్డుల రిజర్వేషన్లు పారదర్శకంగా ఉండాలి: కలెక్టర్

image

మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియను జీవో ప్రకారం అత్యంత పారదర్శకంగా, ఎలాంటి తప్పులు లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ కమిషనర్లు రిజర్వేషన్ పట్టికలను సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు. గణాంకాలు, రొటేషన్ పద్ధతి, గత డేటాను పరిశీలించాలని, ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే సంప్రదించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.