News June 27, 2024
బీజేపీలోకి పటాన్‌చెరు ఎమ్మెల్యే..?
BRSకు మరో షాక్ తగలనుందా..?, పటాన్‌చెరు MLA గూడెం మహిపాల్‌రెడ్డి BJPలో చేరుతారా.. జిల్లాలో అవుననే చర్చ జరుగుతోంది. మహిపాల్‌రెడ్డి ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనతో పార్టీ మారుతారనే టాక్. జహీరాబాద్ మాజీ MP, BJP నేత బీబీ పాటిల్‌తో మహిపాల్‌రెడ్డి సమావేశం కావడంతో ఆయన BJP వైపు అడుగులు వేస్తున్నారన్న అభిప్రాయాన్ని కలిగిస్తోంది. తన అనుచరులకు చెప్పకుండా ఢిల్లీకి వెళ్లడం సైతం పలు అనుమానాలకు తావిస్తుంది.
Similar News
News November 29, 2024
REWIND: కేసీఆర్ అరెస్ట్.. ఆ తర్వాత పరిణామాలు
తెలంగాణ కోసం 2009 NOV29న దీక్ష చేపట్టిన KCR.. సిద్దిపేటలోని రంగధాంపల్లి దీక్షా శిబిరానికి వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించారు. ఈ క్రమంలో దీక్షా స్థలంలో అలజడి మొదలు కాగా వెంటనే హరీశ్ రావు, పద్మాదేవేందర్ రెడ్డి, సోలిపేట ఇతర నాయకులు దీక్ష చేపట్టారు. సిద్దిపేట, రంగధాంపల్లి దీక్షలు యావత్ తెలంగాణను కదిలించాయి. సిద్దిపేట, పాలమూకుల దీక్షలు ఏకంగా 1,531 రోజులపాటు కొనసాగాయి.
News November 29, 2024
REWIND: మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిన కేసీఆర్
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. కానీ మలిదశ ఉద్యమంలో భాగంగా KCR చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమానికి ఊపిరి పోసింది. 29 నవంబర్ 2009లో కరీంనగర్‌లోని తెలంగాణ భవన్ నుంచి దీక్ష శిబిరానికి వెళుతుండగా అలుగునూర్ చౌరస్తా వద్ద KCRని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఖమ్మం తరలించగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. నాటి కేసీఆర్ దీక్షతో తెలంగాణ సుభిక్షం అయింది.
News November 29, 2024
సంగారెడ్డి, మెదక్, సిద్దిపేటలో వణికిస్తోన్న చలి
ఉమ్మడి మెదక్ జిల్లాను తీవ్ర చలి వణికిస్తోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గురువారం అత్యల్పంగా మెదక్ జిల్లా శివంపేటలో 8.9డిగ్రీలు నమోదు కాగా.. సంగారెడ్డి జిల్లా నల్లవెళ్లిలో 9.2, సిద్దిపేట జిల్లా కొండపాక 11.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. సాయంత్రం 5 గంటల నుంచే చలి మొదలై ఉదయం 9 గం. దాటినా తగ్గడం లేదు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.