News June 27, 2024
ఓమ్నీ వ్యాన్ నడిపిన కేసీఆర్

TG: మాజీ CM, BRS అధినేత KCR ఓమ్నీ వ్యాన్ నడిపారు. తుంటి గాయం నుంచి కోలుకుంటున్న ఆయనకు మాన్యువల్‌గా కారు నడిపి చూడమని డాక్టర్లు సూచించడంతో తన పాత ఓమ్నీ వ్యాన్ నడిపినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే కేసీఆర్ వాహనం నడపడంతో ‘‘సారు మళ్లీ ‘కారు’ నడపడం మొదలుపెట్టారు’’ అని పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
Similar News
News April 7, 2026
అక్కడ తొలగించిన ఓటర్లలో 95% ముస్లింలే.. సంచలన నివేదిక

WBలోని నందిగ్రామ్‌లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. తొలగించిన ఓటర్లలో 95.5% మంది ముస్లింలే ఉన్నట్లు సబర్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక వెల్లడించింది. కేంద్రం కుట్రపూరితంగానే ఇలా చేస్తోందని CM మమత ఆరోపిస్తున్నారు. అటు బోగస్ ఓట్లను తొలగించడం రాజ్యాంగబద్ధమని BJP సమర్థించుకుంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో BJP అభ్యర్థి సువేందు అధికారి చేతిలో మమత స్వల్ప తేడాతో ఓడిపోయారు.
News April 7, 2026
పెళ్లి వార్తలపై హీరోయిన్ త్రిష ఇంట్రెస్టింగ్ పోస్ట్

తనపై వస్తున్న పెళ్లి వార్తలపై హీరోయిన్ త్రిష వ్యంగ్యంగా స్పందించారు. ‘నేను సినిమాలకు గుడ్ బై చెప్పేశానట. ఒక కోటీశ్వరుడైన బిజినెస్‌మెన్‌ను పెళ్లి చేసుకున్నానట. నిన్నటితో రెండేళ్లు నిండిన నలుగురు పిల్లలను పెంచుతున్నానట. ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి.. లేదంటే ఈ రోజుకి ఈ రూమర్స్ చాలు’ అంటూ ఇన్‌స్టా వేదికగా తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఎద్దేవా చేశారు.
News April 7, 2026
దాడులు చేయబోతున్నాం, జాగ్రత్త.. ఇజ్రాయెల్ వార్నింగ్

ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులను ముమ్మరం చేసింది. ఆ దేశంలోని రైల్వే వ్యవస్థపై దాడులు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ రోజు రాత్రి 9 గంటల (ఇరాన్ కాలమానం ప్రకారం) వరకు ప్రజలెవరూ రైళ్లలో ప్రయాణించవద్దని, ట్రాక్స్ దగ్గర ఉండొద్దని వార్నింగ్ ఇచ్చింది. ఆ ప్రాంతాల్లో ఉంటే ప్రాణాలు రిస్కులో పడతాయని స్పష్టం చేసింది. కాగా టెహ్రాన్‌తో పాటు IRGC కార్యాలయాలపై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ చేస్తోంది.


