News June 27, 2024
నేనూ సోషల్ మీడియా బాధితురాలినే: హోంమంత్రి అనిత

AP: వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు తీసుకోవడానికే రెడ్ బుక్ అని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. వైజాగ్ సీపీ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో ఆమె సమావేశమయ్యారు. తాను సోషల్ మీడియా బాధితురాలినేనని చెప్పారు. అసభ్య పోస్టులపై చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను నాశనం చేశారని దుయ్యబట్టారు. కేంద్ర నిధులొచ్చినా పోలీసు అకాడమీ నిర్మాణాలు చేయలేదన్నారు.
Similar News
News March 3, 2026
హార్ముజ్‌లో నిలిచిపోయిన 700+ నౌకలు

హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో ఆ మార్గంలో ఇరువైపులా 700+ నౌకలు నిలిచిపోయాయి. వీటిల్లో 334 క్రూడ్ ఆయిల్, 263 శుద్ధి చేసిన, 109 శుద్ధి చేయని చమురు తదితర ట్యాంకులున్నాయి. మార్చి 1వ తేదీనే ఈ మార్గంలో రాకపోకలకు భయపడి కేవలం 3 ట్యాంకర్లతో 2.8M బ్యారెల్స్ చమురునే నౌకలు తరలించాయి. సాధారణ రాకపోకలకు పోలిస్తే ఇది 86% తగ్గినట్లే. నిన్న ఓ చిన్న ట్యాంకర్, కార్గో షిప్ మాత్రమే ఈ మార్గంలో ప్రయాణించాయి.
News March 3, 2026
ఇరాన్ ప్లాస్టిక్ డ్రోన్ల సంచలనం!

సౌదీలోని ‘అరామ్‌కో’ ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ షాహెద్-136 <<19277309>>డ్రోన్లతో<<>> దాడి చేసింది. అమెరికా టెక్నాలజీతో డెవలప్ చేసిన ఈ డ్రోన్లు ప్లాస్టిక్, కార్బన్ ఫైబర్‌తో రూపొందాయి. ఇవి భూమికి 50 అడుగుల ఎత్తులోనే ప్రయాణిస్తాయి. లోహాన్ని మాత్రమే గుర్తించే US రాడార్లకు ఇవి చిక్కకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. ప్రస్తుతం ఈ ఆయుధం జియోపాలిటిక్స్‌లో అమెరికా ఆధిపత్యానికి సవాలు విసురుతోంది.
News March 3, 2026
టాటా మెమోరియల్ సెంటర్‌లో 40 పోస్టులు

<


