News June 27, 2024
కల్కి: రెమ్యూనరేషన్ సగానికి తగ్గించిన ప్రభాస్?

దేశంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల్లో ఒకరిగా పేరున్న ప్రభాస్ ‘కల్కి’కి ఫీజు సగానికి తగ్గించారట. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.150కోట్లు తీసుకుంటారని, ‘కల్కి’కి రూ.80కోట్లే తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు భారీగా బడ్జెట్(రూ.600కోట్లు) పెట్టాల్సి రావడమే ప్రభాస్ నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది. అటు అమితాబ్, కమల్ హాసన్, దీపిక తలా రూ.20కోట్లు తీసుకున్నారట.
Similar News
News April 11, 2026
అమెరికా రాజధానిలో 250 అడుగుల ‘ఇండిపెండెన్స్ ఆర్చ్’!

US రాజధాని వాషింగ్టన్ డీసీలో ప్రతిపాదిత 250 ఫీట్ల ‘ఇండిపెండెన్స్ ఆర్చ్’ డిజైన్‌ను అధ్యక్షుడు ట్రంప్ షేర్ చేశారు. 200ఏళ్ల క్రితం ఓసారి, 124ఏళ్ల క్రితం మరోసారి ఇలాంటి నిర్మాణానికి అప్పటి పాలకులు ప్రయత్నించారని ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచంలో అన్ని ప్రధాన నగరాలకు స్మారకాలు ఉన్నాయని.. ఒక్క వాషింగ్టన్‌కే లేదన్నారు. దీనిపై అక్కడ మిశ్రమ స్పందన వస్తోంది. వైట్‌హౌస్‌లో మార్పులపైనా ఇటీవల <<19523130>>నిరసనలు<<>> చెలరేగాయి.
News April 11, 2026
చర్చల వేళ.. ఇరాన్‌కు భారీ ఊరట?

ఇరాన్‌తో శాంతి చర్చల వేళ అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఖతర్, ఇతర దేశాల్లోని బ్యాంకుల్లో ఫ్రీజ్ చేసిన దాదాపు $100 బిలియన్ల ఇరాన్ ఆస్తులను రిలీజ్ చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇస్లామాబాద్ చర్చల సీరియస్‌నెస్‌కు ఇది నిదర్శనమని ఇరాన్ అధికారి వెల్లడించారు. హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయడంపై ఇది ముడిపడి ఉందని తెలిపారు. అయితే ఆస్తుల విడుదల అంశంపై అమెరికా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
News April 11, 2026
జాతీయ జట్టులోకి వైభవ్! ఐర్లాండ్ సిరీస్‌తో అరంగేట్రం?

వైభవ్ సూర్యవంశీ జాతీయ జట్టులోకి రావడం లాంఛనమే అనిపిస్తోంది. అతిపిన్న వయస్కుడిగా(15 ఏళ్లు) ఎంట్రీ ఇవ్వడానికి అతడు అర్హుడంటూ నిన్న RCBతో మ్యాచ్ అనంతరం IPL ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2 టీ20 మ్యాచుల కోసం జూన్‌లో IND ఐర్లాండ్ వెళ్లనుంది. ఆ సిరీసే వైభవ్‌కు అరంగేట్రం అని తెలుస్తోంది. ఇప్పటివరకు యంగెస్ట్ క్రికెటర్ రికార్డ్ సచిన్(16 ఏళ్ల 205 రోజులు) పేరిట ఉంది.


