News June 27, 2024

ఆగస్టుకు ముందే రుణమాఫీ చేసి చూపిస్తాం: భట్టి

image

TG: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఆగస్టుకు ముందే చేసి చూపిస్తామని, దీన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. రైతు భరోసాపై విధివిధానాలు రూపొందించి, అసెంబ్లీలో చర్చించి అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్రాన్ని పదేళ్లు పాలించినవారు సంపదను దోచేసి రూ.7 లక్షల కోట్ల అప్పు చేసి పారిపోయారని విమర్శించారు.

Similar News

News January 13, 2026

త్వరలో 10వేల పోస్టుల భర్తీ: మంత్రి దామోదర

image

TG: త్వరలోనే ఆరోగ్యశాఖలో 10వేల పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. HYD కోటీలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ గ్రౌండ్స్‌లో 1,257 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు నియామక పత్రాలు అందజేశారు. ఇప్పటివరకు ఆరోగ్యశాఖలో 9,572 పోస్టులు భర్తీ చేసినట్లు తెలిపారు. జంట నగరాల్లో 145 పాలిక్లినిక్‌లు, రాష్ట్రంలో 80 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. పేదల ఆరోగ్యభద్రత ప్రభుత్వ బాధ్యత అన్నారు.

News January 13, 2026

‘మన శంకరవరప్రసాద్ గారు’.. చిరంజీవి రెమ్యునరేషన్ ఎంతంటే?

image

‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి రూ.70 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాలీవుడ్ టాక్. ఈ మూవీకి చిరు కూతురు సుష్మిత కో-ప్రొడ్యూసర్‌గా ఉన్న విషయం తెలిసిందే. కాగా 1992లో ఆపద్బాంధవుడు సినిమాకు రూ.కోటితో దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా మెగాస్టార్ రికార్డు సృష్టించారు. ఆచార్య, వాల్తేరు వీరయ్య సినిమాలకు రూ.50 కోట్లు, భోళా శంకర్‌కు రూ.63 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.

News January 13, 2026

మున్సిపాలిటీ ఓటర్లు.. అత్యధికం ఎక్కడంటే?

image

TG: రాష్ట్రంలో మొత్తం 123 మున్సిపాలిటీల్లో త్వరలో ఎన్నికల నగారా మోగనుంది. ఈ మున్సిపాలిటీల్లో మొత్తం 2,996 వార్డులుండగా 52,43,023 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల పరంగా అత్యధికంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 3,48,051, అత్యల్పంగా వనపర్తి జిల్లాలోని అమరచింత మున్సిపాలిటీలో 9,147 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 123 మున్సిపాలిటీల్లో 113 చోట్ల మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం.