News June 27, 2024

గిరిజన గ్రామాలకు ఫీడర్ అంబులెన్సులు: మంత్రి

image

గిరిజన గ్రామాలకు ఫీడర్ అంబులెన్సులు ఏర్పాటు చేస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. గిరిజనుల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమివ్వాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాలలో మందులు అందుబాటులో ఉండేలా పూర్తి చర్యలు చేపట్టాలని సూచించారు. పీహెచ్సీ వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.

Similar News

News November 27, 2024

VZM: అయ్యప్ప స్వాముల బస్సుకు ప్రమాదం

image

విజయనగరం జిల్లా నుంచి బయలు దేరిన అయ్యప్ప స్వాముల బస్సు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. బుధవారం ఉదయం అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలో వీరి బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 24 మందికి గాయాలయ్యాయి. వారిలో ఐదుగురిని కడప రిమ్స్​‌కు తరలించారు. స్వల్ప గాయాలైన 19 మందిని డిశ్చార్జ్ చేసినట్టు డాక్టర్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 27, 2024

పార్వతీపురం: మూగజీవాలను హింసించిన కేసులో ఇద్దరి అరెస్ట్

image

మూగజీవాలను హింసించిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు సబ్ DFO సంజయ్ తెలిపారు. పార్వతీపురం మండలం బండి ధర వలస గ్రామానికి చెందిన ఎస్.నరసింహరావు, ఏ.నానిబాబు ఉడుమును చంపారని తెలిపారు. చంపి వాటిని తింటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్నారు. అటువీ శాఖ ఆధ్వర్యంలో మూగజీవాలను హింసించే చట్టం క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

News November 27, 2024

విశాఖ-కోరాపుట్ ప్యాసింజర్ రద్దు

image

కోమటిపల్లి, రాయగడ, విజయనగరం మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా విశాఖపట్నం-కోరాపుట్(08546) ప్యాసింజర్‌ను అధికారులు రద్దు చేశారు. ఈనెల 29 నుంచి వచ్చే నెల 4వతేదీ వరకు ప్యాసింజర్ రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. కోరాపుట్- విశాఖపట్నం ఈనెల 29 నుంచి డిసెంబర్ 5 వరకు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.